గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో

Updated on: Apr 13, 2025 | 3:29 PM

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు.విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పైలట్‌ అర్మాన్ బుధవారం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అయితే, అతడికి ఇదే చివరి విమాన ప్రయాణం అవుతుందని ఊహించలేదు.

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన కాసేపటికే అర్మాన్‌ అస్వస్థతకు గురయ్యా డు. దీంతో తోటి సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అర్మాన్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. అంతకుముందు విమానంలో కూడా అతను వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు ప్రకటించారు. పైలట్‌ మృతి పట్ల ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు సంతాపం తెలిపారు.అయితే ఫిబ్రవరిలో, ఎయిర్‌క్రూ సభ్యుల అలసటను తగ్గించే ప్రయత్నంలో పైలట్లు ఎప్పుడు, ఎంతసేపు విమానాలు నడపవచ్చనే దానిపై కఠినమైన పరిమితులను అమలు చేయడానికి DGCA దశలవారీ రోడ్‌మ్యాప్‌ను సిద్దం చేసింది. జూలై 1 నుంచి పైలట్ల వారపు విశ్రాంతిని 36 గంటల నుండి 48 గంటలకు పెంచాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి రాత్రిపూట విమానాలను తగ్గించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం

మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..

ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బీభత్సం.. వీడియో

నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా?వీడియో

యువతి సాహసం.. బెడిసి కొట్టడంతో ఇలా..!వీడియో