ఇజ్రాయెల్- హమాస్ మధ్య సంధి !! బైడెన్ కీలక వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య సంధిలో భాగంగా.. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాలి.
గాజాలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకైతే ఒక నిర్దిష్ట ఒప్పందం కుదరలేదని స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య సంధిలో భాగంగా.. హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనీయులను విడుదల చేయాలి. గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారి కోసం సహాయ సామగ్రితో వందలాది ట్రక్కులను కూడా లోపలికి అనుమతించాలి. దాదాపు ఆరు వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగొచ్చని తెలుస్తోంది. ఇదే విషయమై హమాస్ మినహా వివిధ పక్షాలకు చెందిన ప్రతినిధులు గతవారం ప్యారిస్‌లో సమావేశమైనట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ వెల్లడించారు. సంధి ఖరారుకు అడ్డంకిగా ఉన్న అంశాలు చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఈజిప్టు, ఖతర్, అమెరికా నిపుణులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో భేటీ అయినట్లు కైరో అధికారిక మీడియా వెల్లడించింది. ముస్లింల పవిత్ర మాసం రంజాన్‌కు ముందే ఒప్పందానికి వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
48 కోడిగుడ్ల కోసం ఆశపడి 48 వేలు పోగొట్టుకున్న మహిళ
వంద రూపాయిలకే గ్రాము బంగారం..రూ.10 లకే కేజీ వంటనూనె..
మారిన సూర్యకిరణాల యాంగిల్.. స్లిమ్‌లోని బ్యాటరీ మళ్లీ చార్జ్
శరీరానికి జింక్ అవసరమని.. ఓ వ్యక్తి ఏం చేశాడో చూడండి
అందుకే సాయి పల్లవితో మళ్లీ నటించలేదు !! వరుణ్‌తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్