గల్లంతైన అలాస్కా విమానం దొరికింది

Updated on: Feb 09, 2025 | 10:42 PM

అమెరికాలోని అలాస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. పైలట్‌ సహా అందులోని మొత్తం పది మందీ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఉనలక్లీట్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న సింగిల్‌ ఇంజిన్‌ సెస్నా గ్రాండ్‌ కారవాన్‌ విమానం విమానం నోమ్‌ సమీపంలో గల్లంతైంది. అందులో పైలట్‌ సహా 10 మంది ప్రయాణికులున్నారు.

మరో అరగంటలో ల్యాండవనుండగా రాడార్‌తో సంబంధం కోల్పోయింది. చిట్టచివరి లోకేషన్‌ ఆధారంగా హెలికాప్టర్‌తో అధికారులు గాలింపు చేపట్టి, గడ్డకట్టిన సముద్ర జలాల్లో శకలాలను కనుగొన్నారు. విమానంలో సాంకేతిక లోపం, ఇతర సమస్యలపై ప్రమాదానికి ముందు ఎలాంటి హెచ్చరికలు తమకు అందలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. అమెరికాలోని అలస్కా ట్రయాంగిల్‌ ఒక అంతుచిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. తాజాగా 10 మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవడంతో అలస్కా ట్రయాంగిల్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో యాంకరేజ్‌, జునేయు, ఉట్కియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలస్కా ట్రయాంగిల్‌ అంటారు. ఎత్తయిన మంచుకొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యటకులు ప్రతియేటా గల్లంతవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బహిష్కరణ భయంతో అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

ఒళ్లంతా మొద్దుబారిపోయే.. పక్షవాతం లాంటి జబ్బు..

దుస్తులు తీసేసి ఫోటోలకు ఫోజులు.. గ్రామీ వేడుకల్లో షాకింగ్‌ ఘటన

కుంభమేళా ట్రాఫిక్ జామ్‌ లో.. బస్సు టాప్ పై వీళ్లు ఏం చేశారంటే..

మీకు తరచూ ఆకలిగా అనిపిస్తుందా? కారణం ఇదే