US Govt Shuts Down: అమెరికా ఆర్థిక వ్యవస్థపై షట్ డౌన్ ప్రతికూల ప్రభావం
అమెరికాలో కొనసాగుతున్న సుదీర్ఘ షట్‌డౌన్ అక్కడి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. డెమోక్రాట్ల ఆటంకాలతో 20 రోజులుగా ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. దీనివల్ల ప్రతి రోజు సుమారు 2 బిలియన్ డాలర్ల నష్టం, జీడీపీలో 0.1-0.2% క్షీణత నమోదవుతోంది. లక్షలాది మంది ఉద్యోగులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
అమెరికాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే 20 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ సంక్షోభం, 2019లో నమోదైన 21 రోజుల షట్‌డౌన్‌ను తలపిస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చలేదంటూ రిపబ్లికన్స్ స్టాప్ ఏజ్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీనివల్ల లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి వేతనాలు అందడం లేదు. మిలిటరీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి కీలక విభాగాలు మాత్రం అత్యవసర సేవలను అందిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Rate: అమెరికాలో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అర్థరాత్రి మిస్టరీ కాల్.. చిన్నారి గొంతు విని డీజీపీ షాక్
బాక్స్‌లు విసిరికొట్టిన ఉద్యోగులు.. సోన్ పాపడీ మాకొద్దంటూ..
