భారీ షాక్‌‌లో డొనాల్డ్ ట్రంప్.. స్వయంగా ప్రచారం చేసినా ఓటమి

Updated on: Nov 06, 2025 | 3:25 PM

అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లు ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రచారంలో పాల్గొన్నా జనం డెమోక్రాట్లకు పట్టం కట్టటంతో శ్వేతసౌధంలోని కీలక నేతలంతా తెల్లబోయారు. ముఖ్యంగా కీలకమైన న్యూయార్క్‌ మేయర్‌ స్థానాన్ని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ కైవసం చేసుకోవటంతో.. ట్రంప్ తెల్లబోయారు.

న్యూయార్క్‌తో సహా పలుచోట్ల ఇదే ఫలితం రావటంతో రిపబ్లికన్ నేతలంతా తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇక.. న్యూయార్క్‌ నగర మేయర్‌ పదవిని భారత సంతతికి చెందిన వ్యక్తి కైవశం చేసుకోవటంతో బాటుఈ ఘనత సాధించిన తొలి ముస్లింగా 34 ఏండ్ల మమ్దానీ రికార్డు సృష్టించారు.ఆయన అక్కడ బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమోపై ఘన విజయం సాధించారు. శతాబ్ద కాలంలో నగరానికి అత్యంత పిన్న వయస్కుడైన మేయర్‌గా ఆయన జనవరి 1న బాధ్యతలు స్వీకరించనున్నారు. మమ్దానీ.. ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు కావటం మరో విశేషం. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. మమ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగరానికి ఫెడరల్ నిధులు నిలిపివేస్తామని సోమవారం హెచ్చరించారు. “అనుభవం లేని కమ్యూనిస్ట్ అయిన మమ్దానీ గెలవడం కంటే, విజయవంతమైన రికార్డు ఉన్న డెమోక్రాట్ గెలవడమే మేలు” అని ఆయన వ్యాఖ్యానించారు. “డెమోక్రాట్లకు వేసే ఓటు మరణశాసనమే. రిపబ్లికన్లకు ఓటేయండి” అని పరోక్షంగా ఓటర్లను భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఓటర్లు మాత్రం.. అన్నీ విని.. చివరికి డెమోక్రాట్లనే గెలిపించారు. మరోవైపు.. తన ఘన విజయం అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మమ్దానీ ప్రసంగించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’లోని వాఖ్యలను గుర్తుచేసుకున్నారు. “ఒక శకం ముగిసి, నవశకం వైపు అడుగు వేస్తున్నప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి. సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి గళం వినిపించిన సమయం ఇది” అని తన గెలుపును ఉద్దేశించి ప్రసంగించారు. మీరు మాలో ఎవరి మీదైనా పోరాడాలంటే.. మా అందరినీ దాటి రావాలి’ అని ట్రంప్‌కు మమ్దానీ సవాల్ విసిరారు. ఇక వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎన్నికల్లో కూడా భారత సంతతికి చెందిన డెమోక్రటిక్‌ అభ్యర్థిని గజాలా హాష్మీ విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ రీడ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. హాష్మీ 15వ సెనెటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరికన్ గజాలా. ఈమె భారత సంతతికి చెందిన మహిళే కాదు.. హైదరాబాద్‌ వాసి కూడా. ఎన్నికల్లో ఓటమిపై అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు. రిపబ్లికన్ల ఓటమికి గల కారణాలను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో విశ్లేషించారు. తన పేరు బ్యాలెట్‌పై లేకపోవడం, ప్రభుత్వ షట్‌డౌన్ ప్రభావమే ఓటమికి దారితీశాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలను తినేస్తున్న పులి.. పాపం చిన్నారి

శివాలయంలో పునరుద్ధరణ వేళ.. బయటపడిన నిధి

వరదలో కొట్టుకొచ్చిన బంగారు గాజులు.. నూటికో కోటికో ఒకరే అతడిలా

America: ఘోర ప్రమాదం.. టేకాఫ్‌ అవుతూనే కుప్పకూలింది

మేనమామ చదివింపులే ఏకంగా రూ.1.56 కోట్లు!