Trump Warning: ఇండియాకు ట్రంప్ వార్నింగ్.! డాలర్‌ను దూరం పెట్టారంటే ఖబర్దార్‌..

|

Dec 06, 2024 | 1:11 PM

అంతర్జాతీయ వ్యాపారంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డాలర్‌ను దూరంపెట్టే ప్రయత్నాలు చేసే దేశాలు అమెరికాతో వ్యాపారానికి కూడా దూరం కావాల్సిందేనని హెచ్చరించారు. బ్రిక్స్ దేశాలు ఇండియా, బ్రెజిల్, చైనా, రష్యా, సౌతాఫ్రికాలకు నేరుగా వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ లావాదేవీలకు డాలర్ స్థానంలో మరో కరెన్సీ వాడాలని ఇటీవల బ్రిక్స్ దేశాలు నిర్ణయించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వ్యాపారంలో డాలర్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డాలర్ స్థానంలో వేరే కరెన్సీని ఉపయోగించే దేశాలపై పన్నులు పెంచుతామని చెప్పారు. అమెరికాకు ఆ దేశాలు ఉత్పత్తి చేసే వస్తువులపై పన్నులు 100 శాతం పెంచుతామని స్పష్టం చేశారు. బ్రిక్స్ దేశాల ప్రయత్నాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటామని, డాలర్‌కు దూరంగా జరిగే దేశాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థలో చోటుండదని హెచ్చరించారు. అమెరికాకు ఎగుమతుల విషయం మర్చిపోవాల్సి వస్తుందని వివరించారు. అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో అంతర్జాతీయ లావాదేవీలలో డాలర్‌కు బదులుగా స్థానిక కరెన్సీ వాడాలని నిర్ణయించాయి. దీనివల్ల స్థానిక కరెన్సీ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డాయి. ఈ సమావేశంలో ఈజిప్ట్, ఇరాన్, యూఏఈ ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలిపాయి. ఓ డిక్లరేషన్‌పై బ్రిక్స్ దేశాలు సంతకం చేశాయి. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ ఇండియా సహా బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.