మర్యాదగా ఒప్పుకో.. లేదంటే లేపేస్తాడు జెలెన్ స్కీ‌కి ట్రంప్ వార్నింగ్

Updated on: Oct 22, 2025 | 5:51 PM

అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీకి చేదు అనుభవం ఎదురైంది. బహిరంగ వేదికలపై కీవ్‌కు తోమహాక్‌ క్షిపణులు ఇచ్చి పుతిన్‌ను ఇబ్బందిపెడతానని చెప్పిన ట్రంప్‌... తీరా వైట్‌హౌస్‌లో ట్రంప్ తో భేటీకి రాగానే.. సీన్ రివర్స్ అయింది. పుతిన్‌ ప్రతిపాదించినట్లు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని జెలెన్ స్కీ మీద ట్రంప్ ఒత్తిడి తీసుకువచ్చాడు.

దీంతో..ఒక్కసారిగా జెలెన్ స్కీ షాక్‌కు గురయ్యాడు. ఈ డీల్‌కు అంగీకరించకపోతే రష్యా అధినేత ఉక్రెయిన్‌ను సర్వనాశనం చేస్తాడని, తర్వాత ఎవరైనా చేసేదేం ఉండదని, ఈ సమావేశంలో ట్రంప్‌.. ఉక్రెయిన్ అధినేతను బెదిరించినట్లు తెలుస్తోంది. ఒక దశలో ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. వైట్ హౌస్‌లో ట్రంప్‌తో సమావేశం ప్రారంభం కాగానే, ఉక్రెయిన్‌ బృందం ఇచ్చిన నివేదికలను, మ్యాప్‌లను పక్కన పడేసిన.. ట్రంప్‌ నేరుగా అసలు మ్యాటర్‌లోకి వచ్చేశారని, వెంటనే ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాలని జెలెన్ స్కీని ఆదేశించారని.. మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. రష్యా ఆర్థికవ్యవస్థ చాలా బలంగా ఉందని, సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్‌ను నాశనం చేయటం.. పుతిన్‌‌కు పెద్ద పనేమీ కాదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. నిజానికి.. పుతిన్ ఉక్రెయిన్ విషయంలో.. ఇప్పటికే ట్రంప్‌కు కొత్త కాల్పుల విరమణ ప్రతిపాదనను పంపారు. అందులో ఉక్రెయిన్ డోన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు ఇవ్వాలని, అయితే ఖెర్సన్, జపోరిజ్జియాలోని కొన్ని ప్రాంతాలు ఉక్రెయిన్ వద్దే ఉంటాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ దీనిని పూర్తిగా తిరస్కరించింది. దేశ సార్వభౌమాధికారం, సరిహద్దులను మార్చలేమని స్పష్టం చేసింది. అవసరమైతే ఉక్రెయిన్ తన స్వాతంత్ర్యం కోసం చివరి శ్వాస వరకు పోరాడుతుందని జెలెన్ స్కీ తేల్చి చెప్పటంతో.. ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. దీంతో.. ఉక్రెయిన్‌కి సైనిక సహాయాన్ని పరిమితం చేయాలని, టోమాహాక్ క్షిపణులను సరఫరా చేయడాన్ని నిలిపివేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు.ఈ ఏడాది మార్చిలోనూ.. అమెరికా-ఉక్రెయిన్‌ ఖనిజాల ఒప్పందంపై వైట్ హౌస్‌లో ఓ వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. అప్పుడూ.. తీవ్రస్థాయిలో వీరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకొంది. దీంతో అర్ధంతరంగా నాడు భేటీ, విందు రద్దయ్యాయి. తర్వాత కొన్నాళ్లు నేతలిద్దరూ బెట్టు చేసినా.. తర్వాత మళ్లీ ఇద్దరూ చల్లబడి..ఖనిజాల ఒప్పందం చేసుకొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ చెట్టు ఆకుల్లో బంగారం.. నిర్ధారించిన ఫిన్‌ల్యాండ్ శాస్త్రవేత్తలు

నోరు మూయలేక ఇబ్బందిపడ్డ యువకుడు.. దేవుడిలా వచ్చి

Ram Pothineni: ఒక్క రాత్రిలో జీరోకు వచ్చేశాం.. కానీ ఆ తరువాత..

మీ కూతురు జైల్లో ఉంది.. ఫేక్ కాల్‌ను తిప్పికొట్టిన తండ్రి

సంక్రాంతి బరిలో పెరుగుతున్న పోటీ.. రేసులో ఉన్న సినిమాలేంటి ??