హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.! ఇజ్రాయెల్ దాడుల్లో అగ్ర నేత హతం.

|

Jan 04, 2024 | 6:27 PM

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి చెందాడు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మృతి చెందగా వారిలో అరౌరీ కూడా ఉన్నట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన మిగతా ఐదుగురు అరౌరీ అంగరక్షకులుగా తెలుస్తోంది.

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో హమాస్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాలపై మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, ఆ సంస్థ మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకడైన సలేహ్ అరౌరీ మృతి చెందాడు. ఈ దాడిలో మొత్తం ఆరుగురు మృతి చెందగా వారిలో అరౌరీ కూడా ఉన్నట్టు లెబనాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన మిగతా ఐదుగురు అరౌరీ అంగరక్షకులుగా తెలుస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బుల్లా గ్రూప్‌కు బీరూట్ కేంద్రంగా మారింది. బీరూట్‌ శివారులో ఉన్న హమాస్ కార్యాలయంపై ఇజ్రాయెల్ సేనలు దాడి చేశాయి. హమాస్ డిప్యూటీ నాయకుడిని చంపిన వార్తను హమాస్ టీవీ కూడా పేర్కొంది. లెబనీస్‌లో జరిగిన దాడిలో ఆరుగురు మరణించినట్లు వెల్లడించింది. అటు.. గాజాలోనూ హమాస్‌ సైన్యానికి ఇజ్రాయెల్ సేనలకు మధ్య భీకర పోరు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో 70 మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని హమాస్ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, అరౌరీ మృతిపై ఇజ్రాయెల్ ఆర్మీ నేరుగా స్పందించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.