Russia Seals: సముద్ర తీరలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. వేలాది కళేబరాలతో..మృత్యువాత పడ్డ సీల్స్‌.

Updated on: Dec 13, 2022 | 9:23 AM

ఎవరైనా ఈ సీల్స్‌ను చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానం కూడా వచ్చింది.. అయితే వీటిని వేటాడి ఇక్కడి తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు.. తీరానికి వచ్చిన సీల్స్‌ను ఎవరైనా ..


ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర వేల సీల్స్‌ చనిపోయాయి రష్యా తీరంలో.. ఇంతకీ అవి ఎందుకు మృత్యువాత పడ్డాయి? కాస్పియన్ సముద్రం.. ప్రపంచంలోనే అతిపెద్ద లోతట్టు నీటి వనరు ఇది. రష్యా, కజకిస్తాన్, అజర్‌బైజాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ దేశాలు ఈ సముద్రం చుట్టూ ఉంటాయి. రష్యాలోని డాగేస్తాన్‌ తీరానికి ఇటీవల పెద్ద సంఖ్యలో సీల్స్‌ కొట్టుకొస్తున్నాయి. ఏ ఒక్కటి కూడా సజీవంగా లేదు. అన్నీ మరణించిన సీల్స్‌ ఇవి. ఒకటో, రెండో చనిపోయి తీర ప్రాంతానికి కొట్టుకువస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ చనిపోయిన సీల్స్‌ సంఖ్య భారీ సంఖ్యలో ఉంది. మొదట 700 సీల్స్‌ చనిపోయాని అధికారులు గుర్తించారు. కానీ వీటి లెక్క రెండున్నర వేలకు పైగా ఉండటం కలకలం రేపుతోంది. గత రెండు వారాలుగా కాస్పియన్‌ సముద్ర తీరంలో ఈ పరిస్థితి కనిపిస్తోంది.ఎవరైనా ఈ సీల్స్‌ను చంపేసి ఇక్కడ పడేశారా అనే అనుమానం కూడా వచ్చింది.. అయితే వీటిని వేటాడి ఇక్కడి తీసుకొచ్చిన ఆనవాళ్లు కనిపించలేదు.. తీరానికి వచ్చిన సీల్స్‌ను ఎవరైనా హింసించి చంపేశారా అంటే, అలాంటి పరిస్థితులు కూడా లేవని స్పష్టంగా తెలుస్తోంది.. కాస్పియన్‌ సముద్రంలో సహజ కారణాలవల్లే సీల్స్‌ చనిపోయాయని డాడేస్తాన్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ మినిస్ట్రీ చెబుతోంది.. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) నివేదిక ప్రకారం సీల్స్‌ కాస్పియన్ సముద్రంలో ఉన్న ఏకైక క్షీరదాలు. ఇవి 2008 నుండి అంతరించిపోతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాణలు 3 లక్షల వరకూ ఉంటాయని అంచనా వేస్తున్నారు.. కాస్పియన్‌ సీల్స్‌ను అంతరిస్తున్న ప్రాణులుగా గుర్తించి రెడ్‌ లిస్టులో చేర్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాణులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. చనిపోయిన సీల్స్‌ నుంచి నమూనాలను సేకరించి పరిశోధనలు మొదలు పెట్టారు శాస్త్రవేత్తలు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 13, 2022 09:23 AM