America: సిస్టమ్స్ దెబ్బ.. అమెరికా అబ్బా.. దేశ వ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు.. వీడియో

|

Jan 20, 2023 | 9:44 PM

టెక్నికల్‌ సమస్య అగ్రరాజ్యాన్ని వణికించింది. గంటల తరబడి విమానాలను ఎగరకుండా చేసింది. ఇంతకీ, అమెరికాలో ఏం జరిగింది? సిస్టమ్స్‌ను ఎవరైనా హ్యాక్‌ చేశారా?


అమెరికా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో కొన్ని గంటల పాటు ఈ గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్స్‌లోనే నిలిచిపోయారు. తమ ప్లైట్‌ ఎక్కడుందో.. ఎప్పుడు బయల్దేరుతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో అంతా గందరగోళానికి గురయ్యారు. ట్విట్టర్లో ఫెడరల్ ఏవియేషన్‌ని దారుణంగా తిట్టారు ప్రయాణికులు. పరిస్థితి ఎప్పుడు అదుపులోకి వస్తుందంటూ మండిపడ్డారు. అటు FAA కూడా తీవ్రంగా కృషిచేసి.. సిస్టమ్‌ను రిస్టోర్‌ చేసింది. అయితే ఒకే సారి కాకుండా ఫ్లైట్స్‌ ఒక్కొక్కటిగా అనుమతులు ఇస్తూ వెళ్లారు. దాదాపు 12 గంటల పాటు అమెరికా ఎయిర్‌పోర్టుల్లో ఈ గందరగోళం నెలకొంది. FAA సిస్టమ్‌పై సైబర్‌ అటాక్‌ జరిగిందన్న పుకార్లు కూడా మొదలవడంతో.. వాటిని ఖండించింది సంస్థ. కేవలం సిస్టమ్‌ ఫెయిల్యూర్‌ వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు అమెరికా ప్రెసిడెంట్‌ జో బైడెన్‌. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికాలో ఇలాంటి సమస్య రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై లోతుగా విచారణ చేస్తున్నట్టు ప్రకటించారు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు. అమెరికాలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఇప్పటికే చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజాగా సాంకేతిక లోపాలతో విమాన సర్వీసులను గంటలపాటు ఆపేయడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తంచేశారు. అమెరికాలో జనవరి 11 రాత్రంతా ఈ సమస్య నెలకొంది. అయితే జనవరి 12 ఉదయం 9 గంటల నుంచి క్రమంగా రాకపోకలు మొదలయ్యాయి. కాగా జనవరి 12న 21వేల ఫ్లైట్లు అమెరికా వ్యాప్తంగా తిరగాల్సి ఉంది. అన్నింటినీ షెడ్యూల్‌ చేశామంది FAA.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 20, 2023 09:44 PM