ఏలియన్స్‌ సృష్టేనా ?? ఆకాశంలో వింత వెలుగులు

Updated on: Dec 16, 2025 | 5:59 PM

ఆకాశంలో కనిపించే ఎర్రని మెరుపుల రహస్యం 'స్ప్రైట్స్'గా సైంటిస్టులు గుర్తించారు. దీపావళి మతాబుల్లాంటివి ఇవి. ఏలియన్స్ లేదా దెయ్యాలు సృష్టిస్తాయనే నమ్మకాలు అభూతకల్పనలని నాసా స్పష్టం చేసింది. సాధారణ పౌరులు వీటిని కెమెరాల్లో బంధించగా, నాసా ఫోటోలను షేర్ చేసింది. తుఫాను మేఘాలపై ఏర్పడే ఈ వెలుగులు, ఉరుములతో కూడిన వాతావరణం వల్ల కంటికి కనిపించడం అరుదు.

ఆకాశ వీధిలో ఎర్రని ఎరుపు రంగులో వింతగా మెరిసే వెలుతుర్లు ఏంటనేవి ఇంతకాలానికి స్పష్టమైంది. వీటిని సైంటిస్టులు స్ప్రైట్స్‌ అంటున్నారు. కనిపించేది క్షణమే అయినా, దీపావళి మతాబుల్లాగా రాలిపడుతూ ఆశ్చర్యపడేలా చేస్తున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సిటిజన్‌ సైన్స్‌ ప్రాజెక్టులో పాల్గొన్న ఓ సామాన్య పౌరుడు నికోలస్‌ తాజాగా స్ప్రైట్స్‌ ను తన సాధారణ కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలను నాసా ఎక్స్‌ లో షేర్‌ చేసింది. ఈ వింత వెలుగులు ఏలియన్స్‌ సృష్టించనవి అనీ అతీత శక్తులు సృష్టి అని చాలా మంది నమ్ముతారు. అసలు ఆ వెలుగులు స్వయానా దెయ్యాలేనని విశ్వసించేవారు కూడా తక్కువేం కాదు. అయితే ఇలా ఆలోచించడం అభూత కల్పనేనని సైంటిస్టులు స్పష్టం చేసారు. కుండపోతగా వర్షం పడుతున్న సమయంలో ఆకాశంలో కమ్ముకునే నల్లటి కరి మబ్బుల మీదుగా ఈ వెలుగులు పుట్టుకొస్తాయని అంటున్నారు. అయితే ఇవి మన కంటికి కనిపించడమన్నది చాలా అరుదనీ చెప్పారు. ఉరుములు, మెరుపులతో ఆ మబ్బులు సృష్టించే విలయం sprites వెలుగులను చాలా వరకు కప్పేస్తాయని అన్నారు. స్ప్రైట్స్‌ వెలుగుల గురించి విమాన పైలట్లు రిపోర్ట్‌ చేస్తూనే వచ్చారు. అయితే వీటి తాలూకు స్పష్టమైన ఫోటో 1989లో తొలిసారిగా కెమెరాకు చిక్కింది. అంతరిక్ష కేంద్రం నుంచి నాసా వ్యోమగామి నికోలస్‌ ఈ మధ్య తీసిన ఫొటో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 2022లో ఇద్దరు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు టిబెట్‌ పీఠభూమి మీద ఒకేసారి 105 స్ప్రైట్స్‌ వెలుగులను కెమెరాల్లో బంధించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్‌.. ఒక్క మొక్కజొన్న మొక్కకు ఇన్ని పొత్తులా

నో డిలే.. నో డైవర్షన్‌.. రోడ్లపై దూసుకెళ్తున్న ఇండిగో

ఏంది సామీ నీ ధైర్యం.. సింహాలక్కడ.. వైరల్ అవ్వడం కోసం మరీ ఇలా చేస్తావా ??

బరువు తగ్గించే ఇంజెక్షన్‌ ఇండియాకి వచ్చేసిందోచ్‌..

కొబ్బరి బొండాం పీచును నోటితో వొలిచి.. సత్తా చాటిన మహిళ