బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష
బంగ్లాదేశ్ ICT మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా అల్లర్ల కేసులో ఉరిశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేక నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా, తనపై కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ తీర్పు బంగ్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్, మరింత హింసకు హెచ్చరించారు.
బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కోర్టు ఉరిశిక్ష విధించింది. గత ఏడాది నాటి ఢాకా అల్లర్ల కేసులో దోషిగా నిర్థారించింది. షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అంటూ ICT కోర్టు తీర్పులో పేర్కొంది. అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారని ICT కోర్టు వెల్లడించింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. హసీనా కుమారుడు సాజిబ్‌వాజేద్ అనుమానించినట్లుగానే తన తల్లికి ఉరిశిక్ష పడింది. ఏడాది క్రితం బంగ్లాదేశ్ రణరంగంగా మారింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై ICT కోర్టు నవంబరు 17న తీర్పు వెలువడించింది. అవామీలీగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. బంగ్లాలో మరోసారి హింసాత్మక ఆందోళనలు చెలరేగుతాయని హసీనా కుమారుడు సాజిబ్‌వాజేద్ హెచ్చరించారు. వాజేద్ ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివాసం ఉంటున్నారు. తనపై నమోదైన కేసులు చట్టవిరుద్ధమని ఆరోపించారు హసీనా. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ హయాంలో నేరగాళ్లు హీరోలు అవుతున్నారని అన్నారు తనపై కుట్రలు పన్ని తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పారు హసీనా. ఇలాంటి చర్యలతో తన గళాన్ని అణచివేయలేరని హసీనా అన్నారు. ఈ కుట్రల వల్ల ఎంతో బాధతో తాను స్వదేశాన్ని వీడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి సేవా టికెట్లు రిలీజ్ అప్పుడే
కార్తీకమాసం అద్భుతం.. శివయ్య దర్శనానికి వచ్చిన నాగేంద్రుడు
ఇక ఈ బ్యాంకులు కనిపించవా ?? ఎందుకు ఇలా చేస్తున్నారు ??
