వాషింగ్టన్ లో రికార్డు స్థాయిలో వరద వీడియో
అమెరికా రాజధాని వాషింగ్టన్‌ను కుండపోత వర్షాలు, రికార్డు స్థాయి వరదలు అతలాకుతలం చేశాయి. వంతెనలు కొట్టుకుపోగా, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. 15,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, అత్యవసర పరిస్థితి విధించారు. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సియాటెల్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో, ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అమెరికా రాజధాని వాషింగ్టన్‌ను కుండపోత వర్షాలు, రికార్డు స్థాయిలో సంభవించిన వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. మొత్తం అమెరికాలోనే బీభత్సం సృష్టిస్తున్న ఈ వరదల కారణంగా వాషింగ్టన్ రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల ధాటికి వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పరిస్థితి విషమించడంతో, అధికారులు సుమారు 15,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మరిన్ని వీడియోల కోసం :
