Putin: పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

Updated on: Dec 06, 2025 | 12:04 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయాణించే ఇల్యూషిన్ విమానం 'ఫ్లయింగ్ క్రెమ్లిన్'గా ప్రసిద్ధి. ఇది కేవలం విమానం కాదు, అత్యవసర సమయాల్లో అణ్వస్త్ర ఆదేశాలు జారీ చేయగల మొబైల్ కమాండ్ సెంటర్. విలాసవంతమైన అంతర్భాగం, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు దీని సొంతం. శత్రు క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం, సురక్షిత కమ్యూనికేషన్లతో రష్యా సాంకేతిక నైపుణ్యాన్ని చాటుతుంది.

ఢిల్లీకి చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీతో ఆయన కీలక చర్చలు జరిపారు. అయితే, పుతిన్ కంటే.. ఆయన ప్రయాణించిన ప్రత్యేక విమానంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. కేవలం విమానంలా కాకుండా ఆకాశంలో తేలియాడే ఒక అధ్యక్ష భవనంలా, సైనిక కార్యాలయంలా ఇది కనిపిస్తోంది. పుతిన్ ప్రయాణించే విమానం పేరు ఇల్యూషిన్. దీనిని ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ అని పిలుస్తారు. ఇది కేవలం ప్రయాణ విమానం మాత్రమే కాదు, పూర్తిస్థాయి మొబైల్ కమాండ్ సెంటర్. అత్యవసర సమయాల్లో ఇక్కడి నుంచే సైనిక ఆదేశాలు, చివరికి అణ్వస్త్ర ఆదేశాలు కూడా జారీ చేసేలా దీన్ని రూపొందించారు. దీనిలోని అత్యాధునిక ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని ఏ సైనిక నెట్‌వర్క్‌తోనైనా సురక్షితంగా మాట్లాడవచ్చు. ఈ విమానం లోపలి భాగం ఒక విలాసవంతమైన భవనాన్ని తలపిస్తుంది. బంగారు పూతతో చేసిన వస్తువులు, ఖరీదైన ఫర్నిచర్, అధ్యక్షుడి కోసం ప్రత్యేక బెడ్‌రూమ్, కాన్ఫరెన్స్ హాల్, జిమ్ సదుపాయాలున్నాయి. అదే సమయంలో, భద్రత విషయంలోనూ ఇది అమోఘం. శత్రు క్షిపణులను దారి మళ్లించే వ్యవస్థలు, రాడార్ జామింగ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ దాడులను తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. పూర్తిగా రష్యాలోనే తయారైన ఈ విమానం ఒక్కసారి ఇంధనం నింపితే 11,000 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. ప్రపంచం దేశాధినేతలు అమెరికన్ బోయింగ్ లేదా యూరోపియన్ ఎయిర్‌బస్ విమానాలను ఉపయోగిస్తుండగా, పుతిన్ మాత్రం స్వదేశీ విమానాన్ని వినియోగించడం ద్వారా రష్యా సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ప్రభాస్ నా ఇంటర్‌ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

Indraja: ప్రేమలో మోసపోయారా ?? శాపాలు పెడుతూ ఇంద్రజ ఎమోషనల్!

Bigg Boss Kalyan: చరిత్ర సృష్టించిన ఆర్మీ మ్యాన్! హౌస్‌లో అందరికీ బిగ్ షాక్

సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్