పాక్ మహిళకు భారత పౌరసత్వం.. 20 ఏళ్ల కల సాకారం..
పాకిస్తాన్‌లో ఉగ్రవాదంతో విసిగిపోయిన ఓ హిందూ వ్యాపార కుటుంబం తమ పిల్లలైన పూనమ్, గగన్‌లకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం వారిని 2004లో ఇండియాకు పంపించారు. , అయితే.. వారిలో వారిలో పూనమ్.. స్థానిక వ్యాపారి పునీత్‌ని వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడింది. ఆ తర్వాత పలుమార్లు పూనమ్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉంది.
అయితే.. అధికారులు మాత్రం పూనమ్‌ను విదేశీయురాలిగానే చూశారు. తాజాగా.. సీఏఏ నిబంధనల ప్రకారం ఆమెకు అధికారులు తాజాగా భారత పౌరసత్వాన్ని మంజూరు చేశారు. దీంతో, తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందన్నారు పూనమ్. భారత్ వచ్చిన కొత్తలో పూనమ్ ఢిల్లీ, రాంపూర్ ప్రాంతాల్లో ఉండే వారి బంధువుల ఇళ్ల మధ్య మకాం మారుస్తూ ఉండేది. 2016లో పూనమ్ సోదరుడికి పౌరసత్వం లభించింది. పూనమ్ స్థానికంగా ఉండే బిజినెస్‌మ్యాన్ పునీత్‌ను వివాహం చేసుకుంది. లాంగ్ టర్మ్ వీసా మీద ఇండియాకు వచ్చిన పూనమ్ పెళ్లి తర్వాత.. తన కుటుంబ సభ్యులను కలవడానికి తరచుగా పాకిస్తాన్ వెళ్లేది. అయితే అధికారులు ఆమె పాకిస్తాన్ ఐడీని బ్లాక్ చేశారు. దీంతో పాక్ వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. చివరకు 21 ఏళ్ల తర్వాత ఆమె నిరీక్షణ ఫలించింది. సీఏఏ నిబంధనల ప్రకారం 38 ఏళ్ల పూనమ్‌కు పౌరసత్వం మంజూరు చేశారు అధికారులు. ఈ దీపావళికి తమకు అత్యంత అరుదైన బహుమతి లభించిందనీ పూనమ్ భర్త పునీత్ సంతోషంతో చెప్పారు. త్వరలో ఆధార్, పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తాననీ పూనమ్ అంది. ఇవేం లేకపోయినా తను భారతీయురాలినే అనీ ఇకపై నిజమైన భారతీయురాలిగా జీవిస్తా అంటూ ఉద్వేగానికి లోనైంది.పూనమ్‌కు భారత పౌరసత్వం ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు కనిపించలేదని.. అందుకే ఆమెకు పౌరసత్వం ఇచ్చామని రాంపూర్ ఎస్‌పీ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రేకప్ లీవ్ అడిగిన ఉద్యోగి.. సీఈవో రియాక్షన్ ఏంటంటే..
రీల్ స్టోరీ కాదు.. రియల్ కహానీ.. ముంబైలో గుట్టుగా రెండో కాపురం పెట్టాడు.. ఆ తరువాత
ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారుడిని.. చెట్టుకు కట్టేసిన కాంట్రాక్టర్
గుడికి వెళ్లి వస్తుంటే.. రోడ్డుపై దొరికిన డబ్బు సంచి..
‘అజ్మల్ అమ్మాయిలను వేధిస్తాడు.. నన్ను కూడా ..’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
