PM Rushi Sunak: డోంట్‌ వర్రీ.. బ్రిటన్‌లో కుక్కలను కంట్రోల్‌ చేస్తున్నాం.: రుషి సునక్‌.

Updated on: Sep 18, 2023 | 8:58 AM

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడారంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో కొద్ది రోజులుగా కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. దీనిపై ఆ దేశ ప్రధాని రిషి సునక్ స్పందించారు. ప్రమాదకరమైన శునక జాతిపై నిషేధం విధించామని చెప్పారు. UKలో అమెరికన్ ఎక్స్‌ఎల్‌ బులీ కుక్కలు ప్రమాదకరంగా మారాయని.. వీటినిపై నిషేధం విధించామని ఆయన ప్రకటించారు.

ఒక దేశ ప్రధానే కుక్కల గురించి మాట్లాడారంటే ఆ దేశంలో కుక్కల బెడద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటన్ లో కొద్ది రోజులుగా కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. దీనిపై ఆ దేశ ప్రధాని రిషి సునక్ స్పందించారు. ప్రమాదకరమైన శునక జాతిపై నిషేధం విధించామని చెప్పారు. UKలో అమెరికన్ ఎక్స్‌ఎల్‌ బులీ కుక్కలు ప్రమాదకరంగా మారాయని.. వీటినిపై నిషేధం విధించామని ఆయన ప్రకటించారు. ఇందుకు సంబంధి సునక్ ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సునాక్‌ మాట్లాడుతూ అమెరికన్‌ ఎక్స్‌ఎల్‌ బులీ డాగ్స్‌ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్‌ చేశారు. ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్‌ఎల్‌ బులీ డాగ్స్‌ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమన్నారు. బ్రిటన్‌లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇటీవల జరిగిన దాడులకు కారణంగా నిలిచిన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామన్నారు. ‍ప్రజల రక్షణకు అవసరమైన అన్ని ప్రయత్నాలను చేస్తున్నామని తెలిపారు. సునక్‌ పోస్ట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 1.2 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ప్రధాని నిర్ణయాన్ని కొందరు ఖండిస్తే, మరికొందరు జాతికి అనుకూలంగా మాట్లాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..