Donald Trump: ట్రంప్ కు ఊరటనిచ్చిన ప్రధాని మోదీ ఫోన్

Updated on: Dec 12, 2025 | 7:16 PM

అమెరికన్ కాంగ్రెస్‌లో విమర్శలతో ట్రంప్‌కు తలబొప్పి కట్టిన వేళ, ప్రధాని మోదీ చేసిన ఫోన్ కాల్ ఆయనకు ఊరటనిచ్చింది. మోదీ-పుతిన్ సెల్ఫీ వైరల్ అయిన తర్వాత భారత్-రష్యా సాన్నిహిత్యంపై అమెరికా చట్టసభల సభ్యులు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, మోదీ, ట్రంప్ వాణిజ్య సంబంధాలు, ప్రపంచ పరిణామాలపై చర్చించారు.

అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఫోన్ కాల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొంత ఉపశమనం కలిగించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. పుతిన్‌తో ప్రధాని మోదీ దిగిన సెల్ఫీ వైరల్ కావడంతో, భారత్ రష్యాకు దగ్గరవుతుందనే చర్చ మొదలైంది. ఈ అంశంపై అమెరికా చట్టసభల సభ్యులు ట్రంప్‌ను తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా వ్యవహార శైలి భారత్‌ను రష్యా వైపు నెట్టివేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..

Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..