గోధుమ పిండి కోసం పెద్ద సాహసం.. ట్రక్‌ను బైక్‌లతో ఛేజింగ్..

|

Jan 23, 2023 | 8:52 PM

పాక్‌లో ఆహార కొరత అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఒక్క గోధుమ పిండి బ్యాగ్‌ కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయడంలేదు. ఏకంగా ఓ ట్రక్కును ఛేజ్ చేసి మరీ పిండి బ్యాగును తీసుకున్నారు.

పాక్‌లో ఆహార కొరత అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఒక్క గోధుమ పిండి బ్యాగ్‌ కోసం తమ ప్రాణాలు సైతం లెక్కచేయడంలేదు. ఏకంగా ఓ ట్రక్కును ఛేజ్ చేసి మరీ పిండి బ్యాగును తీసుకున్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం నానాటికి తీవ్రరూపం దాల్చుతోంది. ఆకలి తీర్చుకోవడం కోసం అక్కడి ప్రజలు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారు. తాజాగా గోధుమ పిండి సరఫరా చేస్తున్న ట్రక్కును వందలాది మంది బైక్‌లపై ఛేజ్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గోధుమ పిండి లోడుతో వెళుతున్న ట్రక్కు నుంచి పిండి బ్యాగ్‌ను కొనుగోలు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ట్రక్కు వెనుకభాగంలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఆ వెనుకే వందలాదిమంది బైక్‌లతో ట్రక్కును వెంబడిస్తున్న దృశ్యాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత కొద్దిరోజుల క్రితం ఖైబర్‌ పఖ్తూన్‌ఖ్వా, సింధ్‌, బలూచిస్థాన్‌ వంటి ప్రాంతాల్లో సబ్సిడీలో లభించే గోధుమ పిండి కోసం ప్రజలు గంట కొద్దీ వేచి చూస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని వార్తలు వెలువడ్డాయి. దీంతో భద్రతాబలగాల పర్యవేక్షణలో పిండిని పంపిణి చేస్తోంది ఆ దేశ సర్కార్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుట్‌బాల్‌ చరిత్రలోనే తొలిసారి.. ఏం జరిగిందంటే ??

రాజమౌళికి బంపర్‌ ఆఫర్.. హాలీవుడ్ మేకర్ నుంచి కాల్ !!

TOP 9 ET News: రామ్‌ చరణ్‌కు హాలీవుడ్ సినిమాలో ఛాన్స్‌ | హిస్టరీ క్రియేట్ చేసిన అవతార్ 2

Follow us on