70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్‌..

|

Sep 14, 2023 | 8:45 PM

ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేయాలనుకున్న విమానం రన్‌వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్‌ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్‌కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం సెప్టెంబర్‌ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వ‌ద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్‌ అయింది.

ఎమర్జెన్సీగా ల్యాండ్‌ చేయాలనుకున్న విమానం రన్‌వే వరకూ కూడా వెళ్లలేకపోయింది. దాంతో విమానాన్ని పొలాల్లో ల్యాండ్‌ చేశారు పైలట్లు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. ఉరల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 170 మంది ప్రయాణికులతో సోచి నుంచి ఓమ్స్‌కు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా విమానాన్ని పొలాల్లో దించేశారు. ఉర‌ల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆ విమానం సెప్టెంబర్‌ 12న నోవోసిబిర్స్క్ ప్రాంతంలో ఉన్న కామెనేకి గ్రామం వ‌ద్ద ఉన్న పొలాల్లో ల్యాండ్‌ అయింది. ఎయిర్‌పోర్టులో దించేందుకు ప్రయ‌త్నం చేసినా.. ఆ విమానం ర‌న్‌వే వ‌ర‌కు వెళ్లలేక‌పోయింది. దీంతో అత్యవ‌స‌రంగా ఆ విమానాన్ని .. పంట పొలాల్లో దించేశారు. ఎయిర్‌బ‌స్ ఏ320 విమానం.. సోచి నుంచి ఓమ్కు వెళ్తోంది. మార్గమ‌ధ్యలో ఎమ‌ర్జెన్సీ సందేశం రావ‌డంతో.. ఆ విమానాన్ని నోవోసిబిర్క్స్‌కు పంపే ప్రయ‌త్నం చేశారు. కానీ విమానంలో హైడ్రాలిక్‌ లోపం తలెత్తడంతో నోవోసిబిర్స్క్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని ఓ పొలంలో దించేశారు. విమానంలో 23 మంది చిన్నారులు కూడా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ అయినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ పామును చూసి మగాళ్లే వణికిపోయారు.. ఆ యువతిమాత్రం..

ఆపరేషన్‌ థియేటర్లో కత్తులు పట్టాల్సిన డాక్టర్లు.. కర్రలు పట్టారు

బయటపడ్డ బంగారు గుడ్డు.. జీవి కోసం శాస్త్రవేత్తల వేట !!

Digital TOP 9 NEWS: 100% ఇన్‌ఫ్లేమబుల్.. స్పిరిట్ బిగ్ అనౌన్స్‌మెంట్ | అసలేం పట్టనట్టు తన దారిలోనే NTR

నటుడు, నాయకుడే కాదు.. కామాంధుడు! మోసపోయిన నటి ఆవేదన

Follow us on