శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా

Updated on: Dec 05, 2025 | 6:31 PM

శ్రీలంక వరద బాధితులకు పాకిస్తాన్ పంపిన సహాయ సామాగ్రిపై వివాదం చెలరేగింది. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను పంపారనే ఆరోపణలు, ఫోటోలు వైరల్‌గా మారాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఉన్నత కమిషన్ 'సంఘీభావం' అంటూ పోస్ట్ చేసినా, వివాదం సద్దుమణగడం లేదు. ఈ ఆరోపణలపై పాకిస్తాన్ స్పందన ఇంకా రాలేదు.

వరదలతో అల్లాడుతోన్న శ్రీలంకకు పాకిస్తాన్‌ ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ.. కాలం చెల్లిన వస్తువులు పంపారనే ఆరోపణలపై పాకిస్తాన్‌ రియాక్షన్‌ ఏంటి? శ్రీలకంలో తుఫాన్‌ బాధితులకు పాకిస్తాన్ అందించిన మానవతా సాయంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పంపించిన ఆహార ప్యాకెట్లు, పాలు, తాగునీరు , మెడికల్ కిట్లు ఇతర సహాయ వస్తువులు కాలం చెల్లినవి అంటూ నెట్టింట ఫొటోలు వైరల్ అవుతుండడంతో వివాదం తలెత్తింది. దీంతో.. పాకిస్తాన్ అధికారులపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొలంబోలోని పాకిస్తాన్ హైకమిషన్ కొన్ని ఫొటోలను ఎక్స్‌లో షేర్ చేసింది. వాటిని చూపిస్తూ శ్రీలంకలో వరదల్లో ప్రభావితం అయిన సోదర, సోదరీమణులకు పాకిస్తాన్ నుంచి ప్యాకేజీలను విజయవంతంగా పంపిణీ చేశామని.. ఇది తమ సంఘీభావం అని.. పాకిస్తాన్ ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడు శ్రీలంకకు సాయంగా ఉంటుందంటూ పోస్ట్ చేశారు. అయితే.. పాకిస్తాన్ సాయంగా పంపించిన ప్యాకెట్లపై ముద్రించిన ఎక్స్‌పెయిరీ డేట్ అక్టోబర్-2024 అని ఉన్న ఈ ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ కావడంతో నెటిజన్లు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ఇక ప్యాకేజీలను శ్రీలంక అధికారులు తనఖీలు చేయగా ఈ విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజ్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మానవతా సాయం పంపించే వస్తువులు కూడా ఇలాంటివి పంపిస్తారా.. షేమ్ షేమ్ అంటూ అంటూ విరుచుకుపడ్డారు. ఇదిలావుంటే.. ఈ వివాదంపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.. అవి తప్పుగా ముద్రించబడ్డాయా?.. లేదా? అనేది తేల్చాల్సి ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్

మొన్న ప్రభాస్.. నిన్న చరణ్.. నేడు అల్లు అర్జున్.. అందరి టార్గెట్ ఆ దేశమే

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్

ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. విషయం తెలిస్తే ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిందే

8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా