భారత్ మెరుపు దాడులతో లాహోర్, సియాల్ కోట్ ఎయిర్ పోర్టులు మూసివేశారు. ఇస్లామాబాద్, రావల్ పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు పాక్ అధికారులు. పాక్ పంజాబ్ లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతున్న పాక్ లో నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. బహల్గాం ఎటాక్ తర్వాత భారత్ విధించిన ఆంక్షలతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో సైతం కుప్పకూలింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత స్టాక్ మార్కెట్లో ఆరు శాతం పడిపోయాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి కమాజా కూడా నిన్నటి వరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా ప్రస్తుతం భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆపేస్తామని ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ సైతం యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.