Netanyahu-Macron: ఇజ్రాయెల్‌కు ఆయుధాలను అమ్మకండి.! ఫ్రెంచ్‌ అధ్యక్షుడు..

|

Oct 11, 2024 | 8:11 PM

ఇజ్రాయెల్‌- హమాస్‌ల యుద్ధంలో వేలాది మంది చనిపోయారు. చినికి చినికి గాలివానలా మారిన ఇరు దేశాల ఘర్షణ పశ్చిమాసియాలో యుద్ధానికి.. అలాగే మూడో ప్రపంచ యుద్ధానికీ దారి తీస్తుందా అన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్‌కు ఆయుధ అమ్మకాలను నిలిపివేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తాజాగా పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌ అధినేత తీరుపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ల యుద్ధంలో వేలాది మంది చనిపోయారు. చినికి చినికి గాలివానలా మారిన ఇరు దేశాల ఘర్షణ పశ్చిమాసియాలో యుద్ధానికి.. అలాగే మూడో ప్రపంచ యుద్ధానికీ దారి తీస్తుందా అన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో ఇజ్రాయెల్‌కు ఆయుధ అమ్మకాలను నిలిపివేయాలని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ తాజాగా పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌ అధినేత తీరుపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో.. అసలు ఫ్రాన్స్ ఏమని చెప్పింది.. ఇజ్రాయెల్ కు దీనివల్ల నష్టమేంటి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఏ దేశం.. ఎటువైపు వకాల్తా పుచ్చుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇరాన్‌ అరాచక శక్తులతో ఇజ్రాయెల్‌ పోరాడుతోందనీ.. ప్రపంచం ఇజ్రాయెల్‌ వైపు నిలవాలనీ నెతన్యాహు అన్నారు. కానీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ సహా పాశ్చాత్య నాయకులు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటనీ మండిపడ్డారు. అదే ఆయుధ నిషేధం ఇరాన్‌ హెజ్‌బొల్లా, హమాస్‌, హౌతీలపై ఎందుకు విధించరని ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా లేకున్నా యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్‌ పోరాడుతుందని నెతన్యాహు ఓ వీడియోలో చెప్పిన మాటలు.. ఆసక్తికరంగా మారాయి.

ఇజ్రాయెల్ కు ఇప్పటివరకు అమెరికా గట్టి మద్దతు ఇస్తోంది. అందుకే ఆ దేశం మరింత ధైర్యంగా ముందడుగు వేస్తోంది. కానీ తన ప్రత్యర్థులతో ఇజ్రాయెల్ ఇప్పటికే భీకరంగా పోరాడుతోంది. ఇప్పుడు ఇరాన్ వాటికి తోడైంది. అందులోనూ ఆ దేశం మెరుపు దాడితో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరైంది. సో.. ఇప్పుడు ఇజ్రాయెల్ స్కెచ్ ఎలా ఉంటుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వీలైనంతవరకు యుద్ధం వద్దు.. చర్చలే ముద్దు అంటున్నా.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ దానికి ఊ కొడుతుందా.. ఇరాన్ ను ఉలిక్కిపడేలా చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.