Nepal: నెపో కిడ్ ఉద్యమం వెనుక ఆ వ్యక్తి
నేపాల్‌లో యూట్యూబ్ గూగుల్ సహా 24 యాప్స్‌పై నిషేధం విధించిన ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నేపాలి యువత చేస్తున్న ఆందోళనలు ప్రభుత్వాన్ని కుప్పకూల్చాయి. వీధుల్లోకి వచ్చిన యువత సైన్యం, పోలీసుల అణచివేతను ఎదుర్కొన్నారు. పోలీసుల తొందరపాటుతో కనీసం 20మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు.
దేశ ప్రధాని కేపీ శర్మా ఓలీ రాజీనామా చేసారు. ఈ స్థాయి ఉద్యమానికి ఓ వ్యక్తి నాయకత్వం వహించాడు. అతనే 36 ఏళ్ల సుదన్ గురుంగ్. సుదన్ గురుంగ్ నాయకత్వం వహించే హమి నేపాల్ అనే ఎన్జీవో ద్వారా అతను ఈ ఆందోళనను నడిపించారు. ముందు ప్రశాంత నిరసనలకు ప్రభుత్వ అనుమతి కోరారు. సోలీసులు రోడ్లను బ్లాక్ చేయడంతో విద్యార్థులు ఎంచుకోవలసిన మార్గాలను జాగ్రత్తలను సూచించించి హమీ నేపాల్ సంస్థ. గతంలో సుదన్ ఓ ఈవెంట్ మేనేజర్‌గా పార్టీలను ప్లాన్ చేసి నిర్వహించేవారు. సుదన్ గురంగ్ 2015లో నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపంలో తన బిడ్డను కోల్పోయాడు. ఈ ఘటన అతడి జీవితాన్ని మార్చింది. భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలపైనా పౌర సేవలపైనా దృష్టిపెట్టారు. హమీ నేపాల ఎన్‌జీవో స్థాపన వైపు నడిపించింది. సామాజిక మాధ్యమాల నిషేధంపై యువతలో పెరిగిన ఆగ్రహాన్ని ఆయన ఒక దారిలోకి నడిపించారు. నేపాల్‌లో సోషల్ మీడియా ఆందోళనతో పాటు మరో కొత్త ఉద్యమం ఊపందుకుంది. రాజకీయ నాయకుల పిల్లలు, ధనవంతుల వారసులు అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనలు చేపట్టారు. దీన్ని నెపో కిడ్ మూవ్‌మెంట్‌గా పిలుస్తున్నారు. ప్రధాని కేపీ శర్మ ఓలిని దేశం దాటించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందన్న వార్తలొచ్చాయి. అయితే ఓలి నేపాల్‌లోనే ఉంటారని తెలుస్తోంది. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో కాఠ్‌మాండూలో నిరవధిక కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రత బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. భారత్ నుంచి వెళ్లే విమానాలను నిలిపేశారు. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. నేపాల్‌లోని భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. కాపాడండి ప్లీజ్.. నేపాల్ లో భారత మహిళ ఆవేదన
Robbery: రూ. 4 కోట్ల లగ్జరీ కారు చోరీ.. కనిపెట్టిన చాట్‌జీపీటీ
రోడ్డుపై చెత్త వేస్తున్న వ్యక్తి. మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే
అట్టుడుకుతున్న నేపాల్.. హింసకు అసలు కారణం అదేనా?
Bigg Boss 9: సంజన Vs లక్స్ పాప.. షాంపూ బాటిల్ కారణంగా.. రచ్చ రచ్చ లొల్లి!