నేపాల్ జైళ్ల నుంచి 7 వేలమంది ఖైదీల పరార్ వీడియో
నేపాల్‌లో యువత నిరసనలు హింసాత్మకంగా మారాయి. వందలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జైళ్లలోనూ వీటి ప్రభావం పడింది. ఇప్పటికే.. దేశంలోని పలు జైళ్ల నుంచి 7 వేల మంది ఖైదీలు పరారయ్యారు. కొందరు ఖైదీలు భద్రతా సిబ్బందిపై దాడులు చేసి, జైళ్లకు కూడా నిప్పు పెట్టినట్లు సమాచారం. ఈ హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో అశాంతి నెలకొంది. నౌబస్తాలోని ఓ బాల సదనంలో ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. భద్రతా సిబ్బంది వద్దనున్న ఆయుధాలు లాక్కోవడానికి మైనర్ నేరస్తులు ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఐదుగురు మైనర్లు మృతి చెందారు. ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీయగా.. మృతుల కుటుంబాలు, మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నేపాల్‌లోని రాజ్‌బిరాజ్, ఝుంప్కా, దిల్లీబజార్, చిట్వాన్, నక్కూ, కైలాలీ, జాలేశ్వర్ మొదలైన జైళ్ల నుంచి వేల మంది ఖైదీలు తప్పించుకున్నారని అధికారులు చెబుతున్నారు. సింధూలిగఢీ జైలులో 43 మంది మహిళలతో సహా మొత్తం 471 మంది ఖైదీలు పారిపోయారు. నవాల్‌పరాసీ వెస్ట్ జిల్లా జైలు నుంచి 500 మంది ఖైదీలు తప్పించుకున్నారు. నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు. పారిపోయిన ఖైదీల్లో కొందరు భారతదేశం-నేపాల్ సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సిద్ధార్థనగర్ జిల్లాలోకి చొరబడ్డ ఐదుగురు ఖైదీలను భారత సశస్త్ర సీమా బల్ దళాలు (ఎస్ఎస్‌బీ) అదుపులోకి తీసుకున్నాయి. దిల్లీబజార్ జైలు నుంచి పారిపోతున్న ఓ ఖైదీని స్థానికులు పట్టుకుని సైన్యానికి అప్పగించారు.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
బస్సులో ఫోన్ పోగొట్టుకున్నారా.. జాగ్రత్త వీడియో
అలవాటుగా ఇంటి సీలింగ్‌వైపు చూసి వణికిపోయిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?వీడియో
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!

