ట్రంప్ నిర్ణయాలతో రిలయన్స్ వ్యాపారాలకు కనెక్షన్?వీడియో
ఆసియా కుబేరుడు ముకేష్ అంబానీ దోహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. మరికొందరు కీలక నాయకులతో కూడా ముకేష్ అంబానీ భేటీ అయ్యారు. ఈ భేటీ ట్రంప్ తో తన సంబంధాన్ని మరింత బలపరచుకోవడానికి లేక మరేదైనా వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవడం కోసమా? మొత్తానికి ముకేష్ ట్రంప్ భేటీ వెనుక అసలు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అరబ్ దేశాల పర్యటనలో ఉన్న సందర్భంలో ట్రంప్ కోసం ఎమిర్ ఆఫ్ కతార్ దోహాలో ప్రభుత్వ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ హాజరయ్యారు.
అంబానీని ట్రంప్ ఇంకా కతార్ ఎమిర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ ఏడోది జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో వంద మందికి ఇచ్చిన ప్రత్యేక విందులో నీతా ముకేష్ అంబానీ కూడా పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుని నిర్ణయాలతో రిలయన్స్ వ్యాపారాలకు కనెక్షన్ ఉంది. గత ఏడాది వెనిజులా నుంచి ముడిచమురు దిగుమతులను పునఃప్రారంభించడానికి అమెరికా నుంచి రిలయన్స్ వినహాయింపులు పొందింది. అయితే వెనిజులా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 25 శాతం టారిఫ్‌ను ట్రంప్ విధించడంతో ఆ దిగుమతి ఆగిపోయింది. రష్యా నుంచి ముడిచమురును రిలయన్స్ దిగుమతి చేసుకొని పెట్రోల్ వంటి ఇంధనాలు తయారుచేసి వాటిని అమెరికాకు విక్రయిస్తుంది. గూగుల్ మెటా వంటి అమెరికా దిగ్గజాలకు రిలయన్స్ జియోలో వాటాలున్నాయి. కతార్ తోనూ రిలయన్స్ కు వ్యాపార సంబంధాలున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :