బుర్జ్ ఖలీఫా ఓనర్ బాక్‌గ్రౌండ్‌ చూస్తే మతిపోతుంది

Updated on: Jan 05, 2026 | 5:03 PM

బుర్జ్ ఖలీఫా యజమాని మొహమ్మద్ అలబ్బర్ విజయగాథ స్ఫూర్తిదాయకం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకొని, అమెరికాలో విద్యనభ్యసించి, తిరిగి దుబాయ్ అభివృద్ధికి కృషి చేశారు. ఈమార్ ప్రాపర్టీస్ స్థాపించి, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను నిర్మించి, దుబాయ్‌ను పర్యాటక కేంద్రంగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇది అతని దార్శనికతకు, కష్టానికి నిదర్శనం.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా. చాలామంది బుర్జ్ ఖలీఫా దుబాయ్ ప్రభుత్వానికి లేదా రాజ కుటుంబానికి చెందినదే అనుకుంటారు. కానీ నిజానికి, ఈ భవనం యజమాని మొహమ్మద్ అలబ్బర్ అనే వ్యాపారవేత్త. అలబ్బర్‌ జీవితం రాజభవనంలో సాగిందనుకుంటే పొరపాటే. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి సాంప్రదాయ మత్స్యకారుల పడవకు కెప్టెన్‌గా పనిచేసారు. బాల్యంలో ఆర్థికంగా అంత సౌకర్యం లేకపోయినా, కష్టపడే తత్వం, ఆలోచనా దృక్పథం అలబ్బర్‌ జీవితాన్ని పూర్తిగా మార్చాయి. అలబ్బర్ తన విద్యను దుబాయ్‌లో పూర్తి చేసి, తర్వాత అమెరికా వెళ్లారు. 1981లో సియాటిల్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందారు. ఈ విద్య ఆయనకు భవిష్యత్తులో వ్యాపారంలో పునాదిగా మారింది. అమెరికాలో నేర్చుకున్న ఆర్థిక విధానాలు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఆయన వ్యాపార దృష్టిని మలుపు తిప్పాయి. విద్య పూర్తి చేసిన తర్వాత అలబ్బర్ తిరిగి యుఎఈకి వచ్చి సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగం ప్రారంభించారు. తన ప్రతిభ, కష్టపడే తత్వం వల్ల త్వరగా ఎదిగారు. కొద్ది కాలంలోనే దుబాయ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ విభాగం జనరల్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. e సమయంలో ఆయన దుబాయ్ పాలకుడు మక్తౌంతో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలో దుబాయ్ నాయకత్వం నగరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చాలని సంకల్పించింది. అలబ్బర్‌ దార్శనికతతో దుబాయ్‌లో నూతన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే ఆయన స్థాపించిన ఈమార్ ప్రాపర్టీస్ దుబాయ్ అభివృద్ధికి దారితీసింది. దుబాయ్‌లో భవనాలు, మాల్స్ భవనాలు అన్నీ ఈమార్‌ నిర్మించినవే . దుబాయ్ ఫౌంటెన్ సంగీతంతో నడిచే నీటి అద్భుతం ఈమార్ నిర్మాణ శైలికి ఉదాహరణలు. వీటిలో అగ్రస్థానం మాత్రం బుర్జ్ ఖలీఫాదే. బుర్జ్ ఖలీఫా నేడు ప్రపంచంలోనే ఎత్తైన భవనం మాత్రమే కాదు, మానవ కృషి, సాంకేతిక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు దీన్ని చూసేందుకు వస్తారు. చాలా మంది దీన్ని ప్రభుత్వ భవనంగా భావించినా, వాస్తవానికి ఇది ఈమార్ ప్రాపర్టీస్ యాజమాన్యంలోని ప్రాజెక్ట్. మొహమ్మద్ అలబ్బర్‌ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. సాధారణ కుటుంబంలో పుట్టినా, కష్టపడి పనిచేస్తే ఏ లక్ష్యం అయినా చేరుకోవడం సాధ్యమే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. నిజమెంత ??

రైలు కోచ్‌లపై రకరకాల గీతలు.. ఎందుకో తెలుసా ??

చలికాలంలో ఈ కూరగాయలు తింటున్నారా.. డేంజర్‌

డైట్‌ చేస్తున్నారా ?? రెస్టారెంట్‌ కెళితే ఏం తినాలి ??

Dear Comrade: బాలీవుడ్ కు వెళ్తున్న డియర్‌ కామ్రేడ్‌