10 నిమిషాలు.. 100 బాంబులు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

Updated on: Apr 10, 2026 | 5:56 PM

ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులు చేసింది, దీనికి ప్రతీకారంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని, కాల్పుల విరమణ ఒప్పందం నుండి వైదొలుగుతామని హెచ్చరించింది. 200 మందికి పైగా పౌరులు మరణించారు. ఇరాన్ అణు పరీక్షలు నిర్వహించిందని ఆరోపణలు వెలువడగా, అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభం కానున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగి అంతర్జాతీయ ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

ఇరాన్ మిత్రదేశం లెబనాన్‌పై తాజాగా ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపించింది. 10 నిమిషాలలో 100 వైమానిక దాడులు జరిపింది. దీంతో హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామనీ హెచ్చరించింది. ట్రంప్‌ దీనిపై స్పందిస్తూ టెహ్రాన్‌కు మళ్లీ హెచ్చరికలు చేశారు. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. 1982 తర్వాత లెబనాన్ పై అతి పెద్ద దాడి చేసింది ఇజ్రాయెల్‌. దాడుల్లో 200 మంది పౌరులు మృతి చెందగా వందలాది మంది గాయపడ్డారు. ప్రముఖ మతపెద్ద నబుల్సీ ప్రాణాలు కోల్పోయారు. భవనాలు నేలమట్టమయ్యాయి. స్థానిక ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే నౌకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఇరాన్‌ ప్రకటించింది. జలసంధిలో పరిచిన సీమైన్స్ బారినపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ప్రకటన చేసింది. ఇరాన్‌ రహస్యంగా అణ్వస్త్ర పరీక్ష జరిపిందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధాన సహాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణ్వాయుధ పరీక్షను నిర్వహించిందని ఎక్స్‌ పోస్టులో బయటపెట్టారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 10 పాయింట్ల ప్రతిపాదనలను ఇరాన్‌ పంపిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ అన్నారు. . అందులో ఒకటి చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని సంచలన కామెంట్‌ చేసారు. ఏప్రిల్‌ 11న జె డీ వాన్స్‌ నేతృత్వంలో పాకిస్తాన్‌లో అమెరికా- ఇరాన్‌ తొలి దశ చర్చలు మొదలుకానున్నాయి. కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు వార్తలొచ్చిన కొన్ని గంటలకే తమ ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. UAE, కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్‌లో అత్యంత ఫలవంతమైన రీతిలో పాలన మార్పు జరిగిందని, ఆ దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేసే ప్రణాళికలు ఏమీ లేవని గల్ఫ్ దేశం ఒమన్ స్పష్టం చేసింది. టోల్ ఫీజు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఒమన్ వ్యతిరేకించింది. అయితే అమెరికాకు ఇరాన్ పంపిన 10 డిమాండ్లలో టోల్ ఫీజు వసూలు చేయడం కూడా ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రణ్‌బీర్‌ వర్సెస్‌ రణ్‌వీర్‌.. బాలీవుడ్‌లో బెస్ట్ ఎవరు

Peddi: పెద్దితో వారణాసి.. గట్టిగా వైరల్‌ అవుతున్న పెద్ది స్పెషల్‌ సాంగ్‌ న్యూస్‌

ఇండస్ట్రీలో వైరల్‌ అవుతున్న హీరోయిన్ల అలవాట్లు

సినిమాలకు క్రేజ్‌ తీసుకొస్తున్న సెలబ్రిటీ కపుల్‌

బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో

Follow Us