మరో ఘనత సాధించిన MEIL కువైట్‌లో 225.5 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్
మేఘా ఇంజనీరింగ్ సంస్థ కువైట్‌లో 225.5 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును దక్కించుకుంది. KOC కోసం గ్యాస్ స్వీటెనింగ్, సల్ఫర్ రికవరీ యూనిట్లను 790 రోజుల్లో నిర్మించి, ఐదేళ్లపాటు నిర్వహించనుంది. తాగునీరు, హైడ్రోకార్బన్, విద్యుత్ రంగాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా MEIL పనిచేస్తోందని డైరెక్టర్ దొరయ్య తెలిపారు.
మేఘా ఇంజనీరింగ్ సంస్థ (MEIL) కువైట్‌లో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించి తన అంతర్జాతీయ ఉనికిని చాటుకుంది. KOC (కువైట్ ఆయిల్ కంపెనీ)కి సంబంధించిన గ్యాస్ స్వీటెనింగ్ మరియు సల్ఫర్ రికవరీ యూనిట్ల నిర్మాణానికి 225.5 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టును MEIL దక్కించుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా, MEIL 790 రోజుల్లో ప్లాంట్‌ను నిర్మించి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించింది. నిర్మాణానంతరం, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఐదేళ్ల పాటు ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కూడా చేపట్టనుంది. ఇప్పటికే MEIL రాజస్థాన్ మరియు మంగోల్ రిఫైనరీలలో సల్ఫర్ రికవరీ యూనిట్లను విజయవంతంగా నిర్మించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..
తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??
