Mark Zuckerberg: సీక్రెట్ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్న మెటా అధినేత

|

Mar 09, 2024 | 8:10 PM

హవాయి ద్వీపాల్లోని మారుమూల ద్వీపమైన కవాయిలో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సీక్రెట్ బంకర్‌ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2100 కోట్లు వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఒక భారీ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని న్యూస్‌డాట్‌కామ్‌ఏయూ (news.com.au) కథనం పేర్కొంది. 2014లో కొనుగోలు చేసిన లగ్జరీ ఎస్టేట్‌లో దీనిని నిర్మిస్తున్నారని అందులో తెలిపింది.

హవాయి ద్వీపాల్లోని మారుమూల ద్వీపమైన కవాయిలో మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సీక్రెట్ బంకర్‌ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా 260 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.2100 కోట్లు వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. మార్క్ జుకర్‌బర్గ్ ఒక భారీ భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని న్యూస్‌డాట్‌కామ్‌ఏయూ (news.com.au) కథనం పేర్కొంది. 2014లో కొనుగోలు చేసిన లగ్జరీ ఎస్టేట్‌లో దీనిని నిర్మిస్తున్నారని అందులో తెలిపింది. అత్యంత దుర్భేద్యంగా ఉండేలా దాదాపు దశాబ్దకాలంగా ఈ బంకర్ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించింది. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూగర్భ బంకర్‌ను నిర్మిస్తున్నారని పేర్కొంది. ఈ బంకర్‌కు స్వయంగా విద్యుత్, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉందని వివరించింది. ఈ బంకర్ నిర్మాణానికి సంబంధించి జుకర్‌బర్గ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, బంకర్ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నిర్మాణ కార్మికులను పనిలో నుంచి తీసేసినట్టు వైర్డ్ కథనం పేర్కొంది. అక్కడ పనిచేస్తున్న కొందరు వ్యక్తులను సంప్రదించగా ఈ విషయం తెలిసిందని వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేశారు.. మౌత్‌ వాష్‌ చేసుకోగానే ??

Potato Peel: వార్నీ.. ఈ తొక్కలో ఇంతుందా ?? ఇకపై తోలు తీస్తారా ??

TOP 9 ET News: రూ.1370 కోట్లకు అధిపతి | ఇక నుంచి సిగ్గు ఎగ్గు జాన్తానై

అల్లు అర్జున్‌కు క్రేజ్‌కు.. పడిపోయిన మరో హీరోయిన్

దెయ్యాన్ని కూడా వదలనంత కరువా ?? దిమ్మతిరిగే రొమాంటిక్ టీజర్

Follow us on