బోర్‌ కొట్టడంతో.. సరదాగా బ్యాంక్‌ చోరీ చేసిన వ్యక్తి !!

|

Dec 19, 2022 | 9:39 PM

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన జీవితంపై బోర్‌ కొట్టిందని, వినోదం కోసం కొత్తగా ఏదైనా చేయాలని భావించి రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు.

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ షాకింగ్ దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన జీవితంపై బోర్‌ కొట్టిందని, వినోదం కోసం కొత్తగా ఏదైనా చేయాలని భావించి రెండు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఓర్లాండో నగరంలోని గ్యాస్ స్టేషన్, బ్యాంకులో దోపిడీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో ఈ విషయాలను వెల్లడించడంతో పోలీసులు అవాక్కయ్యారు. 45 ఏళ్ల వయసున్న నికోలస్ జాపటర్‌కు జీవితం పట్ల బోర్‌ కొట్టింది. దాంతో ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఆలోచిస్తుండగా బ్యాంకు దోపిడీ చేయడం బాగుంటుందనిపించింది. బ్యాంకులో దోపిడీ చేస్తున్న సమయంలో పోలీసు టోపీ, అద్దాలు ధరించాడు. డిసెంబర్ 5 ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బ్యాంకులో తొలి దోపిడీకి పాల్పడ్డాడు. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు !! కదులుతున్న రైలునుంచి ఒక్కసారిగా..

ప్రేయసి కోసం వెళ్లి బావిలో దూకిన ప్రియుడు.. తర్వాత ??

Namrata Shirodkar: ‘ఆరోజు మా జీవితాల్లో భయానకమైనది’ నమ్రత ఎమోషనల్ !!

Shah Rukh Khan: చరణ్‌పై షారుఖ్‌.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !!

Jabardasth Vinod: దారుణంగా జబర్దస్త్‌ కమెడియన్ ఆరోగ్య పరిస్థితి !!

 

Published on: Dec 19, 2022 09:39 PM