ఆస్ట్రేలియా లో ఎన్నారైలను కలిసిన లక్ష్మీపార్వతి వీడియో

Updated on: Nov 16, 2025 | 6:10 PM

ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి మద్దతు కూడగట్టేందుకు లక్ష్మీపార్వతి ఎన్నారైలను కలిశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల చూపిన ఆదరాభిమానాలకు పార్టీ కృతజ్ఞతలు తెలిపింది. జగన్, వైఎస్‌ఆర్‌ పథకాలతో ప్రయోజనం పొందిన పలువురు ఎన్నారైలు, పార్టీకి తమ మద్దతు తెలియజేస్తూ రుణం తీర్చుకుంటామని చెప్పారు. బ్రిస్బేన్‌లో కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తల ఆత్మీయ ఆతిథ్యం పట్ల లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియాలో వైఎస్సార్‌సీపీకి మద్దతుగా లక్ష్మీపార్వతి అక్కడి ప్రవాస భారతీయులు (ఎన్నారైలు)తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పట్ల కష్ట కాలంలోనూ చూపిస్తున్న ఆదరాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలకు ఎన్నో విధాలుగా,మేలు జరిగిందని పేర్కొన్నారు. తమలో చాలా మంది వై.ఎస్. రాజశేఖరరెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలను ఉపయోగించుకొని విదేశాల్లో స్థిరపడ్డామని, అందువల్ల ఆయన రుణం తీర్చుకుంటామని తెలియజేశారు.

మరిన్ని వీడియోల కోసం :

మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో