Japan Moon Mission: నింగిలోకి దూసుకెళ్లిన జపాన్‌ ల్యాండర్‌.. నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి

| Edited By: TV9 Telugu

Sep 08, 2023 | 12:01 PM

జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ ప్రయోగించింది. సెప్టెంబరు 7 గురువారం ఉదయం 8 గంటల 42 నిమిషాలకు జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మూన్ స్నిపర్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది.

జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్‌ను జపాన్ ప్రయోగించింది. సెప్టెంబరు 7 గురువారం ఉదయం 8 గంటల 42 నిమిషాలకు జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లోని యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి హెచ్‌-2ఏ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది మూన్ స్నిపర్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి మోసుకెళ్లింది. ఈ ల్యాండర్ నాలుగు నెలల్లో చంద్రుని కక్ష్యలోకి చేరుతుంది. అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుని ఉపరితలాన్ని తాకిన ఐదో దేశంగా జపాన్‌ చరిత్ర సృష్టించనుంది. ప్రతికూల వాతావరణం కారణంగా జపాన్‌ మూన్‌ స్నిపర్‌ మిషన్‌ మూడుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అభివృద్ధి చేసిన పరిశోధన ఉపగ్రహాన్ని కూడా ఈ రాకెట్ మోసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని దక్షిణ జపాన్‌లోని తనేగషిమా నుంచి ఆన్‌లైన్‌లో 35 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 28న హెచ్‌-2ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీరేం దొంగలు బాబోయ్‌ !! ఒక్క రాత్రిలో మాయం చేశారు !!

ప్రసవం కోసం వచ్చిన మహిళ.. కడుపులో ప్లేట్‌ పెట్టి కుట్టేసిన డాక్టర్లు !!

పెళ్లి కావాలని పూజ‌లు.. విసుగెత్తి శివ‌లింగాన్నే ఎత్తుకెళ్లాడు

శాడిస్ట్‌ భర్త.. కట్నం కోసం భార్యను బావిలో వేలాడదీసాడు

Rajgir Glass Bridge: ఈ అద్భుత గాజు వంతెన విదేశాల్లో కాదు.. బీహార్‌లోనే..

 

Follow us on