జపాన్.. త్వరలో లాక్ డౌన్ !! ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
జపాన్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా.. భారీ సంఖ్యలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయి. దీంతో.. అధికారులు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వైరస్ శరవేగంగా వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..జపాన్‌లోని ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయి.
పాఠశాలలు, మార్కెట్లు మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పరిస్థితి చేయి దాటిపోతే లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది. అయితే, జపాన్‌లో దాదాపు ప్రతి సంవత్సరం.. ఫ్లూ కారణంగా ఇటువంటి పరిస్థితులు సంభవించటం సహజమే అయినా.. ఈ ఏడాది మాత్రం సీజన్ కంటే ఐదు వారాల ముందుగానే ఈ పరిస్థితి తలెత్తింది. అయితే, ఈ వ్యాధి జపాన్‌కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులు ఇలాంటి నమూనాలను గమనించారు. విదేశీయులను క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే దేశంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితిలో దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని హొక్కైడో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ప్రొఫెసర్ యోకో సుకామోటో వ్యాఖ్యానించారు. గత రెండు దశాబ్దాలుగా ఏటా ఇదే సమయంలో ఫ్లూ ఎందుకు విజృంభిస్తుందనే దానిపై పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని సుకామోటో అన్నారు. జపాన్‌తో సహా పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా 4,030 మంది ఫ్లూకు చికిత్స పొందినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 3న జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారిని ప్రకటించింది. గత వారంతో పోలిస్తే 957 కేసులు పెరిగినట్లు గుర్తించారు. పర్యాటకులు పెద్ద ఎత్తున తిరిగి రావడం వైరస్ వ్యాప్తిగా కారణంగా చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అఖండ 2 ప్రమోషన్ ప్లాన్ ఏంటి..? బాలయ్య రంగంలోకి దిగేదెప్పుడు?
Pawan Kalyan: పవర్ స్టార్ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??
గేరు మార్చిన టాప్ కెప్టెన్స్.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు
రీ రిలీజ్ సినిమాలకు మళ్లీ క్రేజ్.. రెడీ అయిన వరుస సినిమాలు
