న్యూ ఇయర్ తొలి రోజే పాక్ కుట్ర భగ్నం
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నూతన సంవత్సర తొలి రోజే పాకిస్తాన్ డ్రోన్ కలకలం రేపింది. భద్రతా బలగాలు డ్రోన్‌ను గుర్తించి, అది జారవిడిచిన బ్యాగును స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఐఈడీతో పాటు డ్రగ్స్‌ను కనుగొన్నారు. సరిహద్దుల్లో ఉగ్రకుట్రలను ఐఎస్‌ఐ పన్నినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. జమ్ము కశ్మీర్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది.
జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నూతన సంవత్సర తొలి రోజే పాకిస్తాన్ డ్రోన్ కదలికలు తీవ్ర కలకలం సృష్టించాయి. భద్రతా బలగాలు ఈ కుట్రను భగ్నం చేశాయి. డ్రోన్ నుంచి జారవిడిచిన అనుమానాస్పద బ్యాగులో ఐఈడీ (IED) తో పాటు డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఈ పాక్ డ్రోన్ సరిహద్దు ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్లు గుర్తించారు. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా, ఖాదీ కర్మదాతో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరింత వణికించనున్న జనవరి.. పెరగనున్న చలి తీవ్రత
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 30 నిమిషాల ముందు టికెట్ బుక్ చేసుకునే ఫెసిలిటీ
