ఇజ్రాయెల్ సైలెంట్ స్కెచ్.. ప్రతిదాడి లేకుండానే ప్రతీకారం
ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోం అని తెలిపారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ అన్నారు.
ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోం అని తెలిపారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ అన్నారు. ప్రస్తుతం ఆయన టెల్ అవీవ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని నెతన్యాహు.. కామెరూన్‌కు తెలిపారు. ఇరాన్‌పై స్పందించాలని ఇజ్రాయెలీలు నిర్ణయించుకున్నారనీ అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా, బలంగా స్పందించాలని తాము చెప్పినట్లు కామెరూన్ అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి బేర్‌బాక్ కూడా టెల్‌అవీవ్‌లోనే ఉన్నారు. అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ నియంత్రణ పాటించాలనీ ఇప్పటికే దాడిని అడ్డుకొని ఇజ్రాయెల్ విజయం సాధించిందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెట్లను కౌగలించుకోవడానికి రూ.వేలు చెల్లించాలా !!
తొలిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. 112వ ర్యాంక్ సాధించిన సాహి దర్శిని
అతలాకుతలమైన ఎడారి రాజ్యం !! ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తోందా ??
17 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా ఆపరేషన్లు.. మావోయిస్టులకు సింగం ఎన్‌కౌంటర్ల ‘లక్ష్మణ్’