Most Expensive City : అత్యంత ఖరీదైన నగరం ఇదే !! పేరు తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

|

Dec 11, 2021 | 8:30 AM

పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది.

YouTube video player

పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అనే సంస్థ అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఆగస్టు.. సెప్టెంబర్‌ నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల్లో ఉన్న నిత్యావసర వస్తువుల ధరలు, అద్దె, రవాణా తదితర వ్యయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ జాబితాలో తొలిసారిగా ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరంగా ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవివ్‌ నగరం నిలిచింది. పారిస్‌, సింగపూర్‌ సమాన పాయింట్లతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. జ్యూరిచ్‌ నాలుగో స్థానంలో, హాంకాంగ్‌ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక ఆరో స్థానంలో న్యూయార్క్‌ ఏడో స్థానంలో జెనివా, ఎనిమిదో స్థానంలో కోపెన్‌హాగెన్‌ తొమ్మిదో స్థానంలో లాస్‌ ఎంజెలెస్‌, పదో స్థానంలో ఒసాకా ఉన్నాయి. గతేడాది పారిస్‌, జ్యూరిచ్‌, హాంకాంగ్‌ నగరాలు అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: ఇదేం వింత అలవాటు !! వారానికి ఒక్కసారేనా ?? వీడియో