లీటరు వంట నూనె 18 లక్షలు.. ఒక్క ట్రే గుడ్ల ధర 35 లక్షలు

Updated on: Jan 12, 2026 | 5:07 PM

ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనంతో నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి. గుడ్లు, వంట నూనె వంటివి రెట్టింపు ధరలకు అమ్ముడవుతున్నాయి. ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా ప్రజల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నా, ఆహార ధరలు మరింత పెరిగి నిరసనలకు దారితీశాయి.

ఒక్క ట్రే గుడ్లు 35 లక్షలు. గతవారం ఇది 22 లక్షలే. లీటరు వంట నూనె ధర 7.90 లక్షల రియాల్స్‌ నుంచి 18 లక్షల రియాల్స్‌కు పెరిగింది. ఇలా అన్నింటి ధర వారంలోనే దాదాపు రెట్టింపయ్యింది. నెలకు సరిపడా సామాను కావాలంటే కట్టల కొద్దీ డబ్బు తీసుకెళ్లాల్సిందే. ఈ ధరలు విని పరేషాన్‌ కాకుండ్రి. ఎందుకంటే ఇది ఇరాన్‌లోని తాజా పరిస్థితి. ఆర్థిక సంక్షోభంతో ఇరాన్‌ కరెన్సీ దారుణంగా పడిపోయింది. నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. దీంతో జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. పరిస్థితి చక్కబెట్టేందుకు ఇరాన్‌ ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా చేతికి డబ్బు ఇస్తోంది. అయినా ఆందోళనలు ఆగడం లేదు. ఇరాన్ లో ప్రస్తుతం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల రేట్లు చుక్కలను అంటుతున్నాయి. ఇరాన్ కరెన్సీ భారీగా పడిపోయింది. మార్కెట్లు మూతపడటంతో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణకు సబ్సిడీ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సబ్సిడీలకు బదులుగా ప్రజల చేతికే డబ్బు ఇస్తోంది. ప్రతి నెల 10 మిలియన్ రియాల్స్ బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. అయితే, ఇది ఆహార ధరలు మరింత పెరగడానికి కారణమైంది. వారం రోజుల వ్యవధిలోనే ధరలు డబుల్ అయ్యాయి. డాలర్‌‌తో పోలిస్తే రియాల్ విలువ 14.7 లక్షలకు చేరింది. దీంతో ధరలు భారీగా పెరిగాయని నిపుణులంటున్నారు. అమ్మకాలు పడిపోవడంతో దుకాణదారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. వ్యాపారం దెబ్బతిందని వాపోతున్నారు. మార్కెట్ పరిస్థితులు బాగోలేవని, కస్టమర్లు కొన్ని వస్తువులను కొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరెన్సీ విలువ పడిపోవడంతో నిత్యవసరాలు సహా అన్నింటి ధరలు 50 నుంచి 100శాతం రెట్టింపయ్యాయని వాపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్

ఇక్కడ ఆడాల్సిందే.. లేదంటే ఇంటికే బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్

MSVG Review: చిరును వాడడం అంటే ఇది! అనిల్ మళ్లీ నెగ్గాడ్రోయ్‌..! రివ్యూ…!

Toxic: కారులో ఆ పాడు సీన్‌ పై రచ్చ.. డిలీట్ చేయాలంటూ డిమాండ్

Shreyas Iyer: కుక్క దాడి.. షాక్‌లో శ్రేయస్ అయ్యర్