మా వేలు ట్రిగ్గర్ పైనే ఉంది.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ భయం నెలకొంది. అధ్యక్షుడు ట్రంప్ సైన్యాన్ని ఇరాన్ వైపు మోహరిస్తున్నారు. ఇరాన్‌లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులకు ట్రంప్ మద్దతు తెలిపారు. తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందని ఇరాన్ హెచ్చరించింది. గతంలో యుద్ధం తప్పిందని భావించినప్పటికీ, ప్రస్తుత సైనిక కదలికలు పశ్చిమాసియాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి, ఇది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం తప్పేలా లేదా? అమెరికా సైన్యం ఇరాన్ దిశగా కదులుతోంది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తెలిపారు. ఇరాన్‌ను నిశితంగా గమనిస్తున్నామనీ భారీ సంఖ్యలో అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయనీ, ఏమీ జరగకూడదనే తను భావిస్తున్నట్లు చెప్పారు. దావోస్ నుంచి అమెరికా వెళూతూ ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానంలో ట్రంప్ ఈ కామెంట్ చేశారు. అమెరికా సైన్యం మోహరింపుపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ వేలు ట్రిగ్గర్‌పైనే ఉందని తెలిపింది. ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఘర్షణల్లో 5,002 మంది మరణించారు. ఆందోళనకారులకు మద్దతుగా ట్రంప్ నిలిచారు. వారికి హాని కలిగిస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. గత వారం ట్రంప్ మాట్లాడుతూ ఆందోళనకారులకు మరణశిక్ష విధించబోమని ఇరాన్ నుంచి హామీ లభించిందని తెలిపారు. ఇరాన్‌పై సైనిక చర్య తీసుకోమని అన్నారు. దీంతో యుద్ధం తప్పిందని అంతా భావించారు. ఇప్పుడు అమెరికా యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వైపు కదులుతుండటంతో భయాందోళనలు పెరిగాయి. పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాల రక్షణకే ఈ సేనలను మోహరిస్తున్నామని అమెరికా అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. యుద్ధ విమానాలతో ఉన్న యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌక, పలు గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయర్లు త్వరలోనే పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారీ వర్షంలోనూ పరేడ్.. ఆసక్తిగా తిలకించిన జనం
పడిపోయినా వదల్లేదు.. రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
రైల్వేలో రోబో క్యాప్.. విధుల్లోకి అర్జున్