Mummy: ఈ మమ్మీ పుర్రె ఎముకల్లో గాయాలు .. అరుదైన ఈ వ్యాధే కారణమా..? మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్..

|

Jul 19, 2022 | 9:44 AM

రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్‌ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్‌ ఆనవాళ్లు కనిపించాయి. 19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు


రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్‌ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్‌ ఆనవాళ్లు కనిపించాయి. 19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది.ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్‌ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్‌ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజో ఫరెంజియో అనే అరుదైన కేన్సర్‌ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్‌. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్‌ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..