పాలు తెస్తానని వెళ్లి.. డ్యామ్‌లో
రష్యాలో వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి అదృశ్యమై శవమై కనిపించడం తీవ్ర విషాదం నింపింది. పాలు తెచ్చేందుకు వెళ్లిన అజిత్ 19 రోజుల తర్వాత డ్యామ్‌లో మృతదేహమై దొరికాడు. ఈ మృతి అనుమానాస్పదమని తల్లిదండ్రులు విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ ఘటన రష్యాలో భారతీయ విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతోంది, పూర్తి స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నారు.
పాలు తీసుకు వస్తానంటూ ఆ విద్యార్థి బయటకు వెళ్లాడు. “పాలు కొనుక్కుని అరగంటలో తిరిగి వస్తాను” అని తన స్నేహితులకు చెప్పిన అజిత్.. తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. దీంతో అతని స్నేహితులు స్థానికంగా వెతికారు. ఎంతకూ లాభం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రష్యాలో జరిగింది. అలా బయటకు వెళ్లిన అతడు 19 రోజుల తర్వాత స్థానికంగా ఉన్న ఓ డ్యామ్‌లో శవమై కనిపించాడు. యుఫాలోని వైట్ నది సమీపంలో అజిత్‌కు సంబంధించిన దుస్తులు, మొబైల్ ఫోన్, షూ దొరికాయి. ఆ పక్కనే మృతదేహం పడి ఉంది. అతడి స్నేహితులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. వారంతా ఆ మృతదేహం అజిత్‌దేనని ధృవీకరించారు. ఈ సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. రష్యా వెళ్లిన ఆ భారతీయ విద్యార్థి దారుణమైన పరిస్థితుల్లో మరణించాడు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల అజిత్ సింగ్ చౌదరి..2023లో యుఫా నగరంలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ కోర్సులో చేరాడు. అప్పటి నుంచి అక్కడే చదువుతున్నాడు. తమ కుమారుడిని ఎంబీబీఎస్ చదివించడానికి.. ఉన్న కొద్దిపాటి పొలాన్ని కూడా అమ్ముకున్నట్లు అతడి తల్లిదండ్రులు చెప్పారు. తమ కొడుకు డాక్టర్ అయి తిరిగి వస్తాడనుకుంటే.. శవమై తిరిగి వస్తున్నాడంటూ గుండెలవిసేలా రోదించారు. ముఖ్యంగా అజిత్ తండ్రి రూప్ సింగ్, తల్లి సంత్రా దేవిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. అజిత్ మృతి అనుమానాస్పదంగా ఉందంటూ.. తల్లిదండ్రులు, స్థానిక నేతలు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. ఈ ఘటన రష్యాలో భారతీయ విద్యార్థుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతోంది అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రచ్చ రచ్చగా మిస్ యూనివర్స్ భామల వాకౌట్‌తో షాక్
భారత్‌లో ఆమె ఫొటోతో నకిలీ ఓట్లు ?? లారిస్సా ఏమంది అంటే
టీచర్‌కు రూ.88 కోట్ల నష్టపరిహారం.. ఆ రోజు ఏం జరిగిందంటే ??
బహుబలి అరటి హస్తం..ఏకంగా 80 పండ్లు.. సెల్ఫీ దిగిన కొనుగోలుదారులు
