టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. గువాహటి-కోల్‌కతా మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. జనవరి 17న ప్రధాని మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. పూర్తి ఎయిర్ కండీషన్‌తో 3 ఏసీ, 2 ఏసీ, 1 ఏసీ బోగీలుంటాయి. ఆటోమేటిక్ స్లయిడింగ్ డోర్స్, అధునాతన టాయిలెట్లు, ప్రమాదాల నివారణ కు కవచ్ వ్యవస్థ ఇందులో ఉంటాయి
వందే భారత్ స్లీపర్ రైళ్లలో ప్రయాణించే వారికి ఇండియన్ రైల్వేస్ ప్రాజెక్ట్ మేనేజర్ అనంత్ రూపనగుడి వార్నింగ్ ఇచ్చారు. టాయిలెట్ వినియోగం, ప్రజా ఆస్తులను గౌరవించే ప్రయాణీకులు మాత్రమే వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలని అన్నారు. ఆందోళన ఏమిటంటే చాలా మంది ప్రయాణీకులు టాయిలెట్లను ఫ్లష్ చేయరు లేదా అది పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేయరు అని ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రైలు అధికారికంగా ప్రారంభం కాక ముందే, దాని వేగం లేదా ఆన్‌బోర్డ్ సౌకర్యాల కంటే ప్రయాణీకుల ప్రవర్తన, పరిశుభ్రత గురించి చర్చలు మొదలయ్యాయి. సాధారణ వందే భారత్ లో నీరు, టిష్యూల వంటి ప్రాథమిక సౌకర్యాలు కొన్నిసార్లు తక్కువగా ఉన్నాయని అనేక మంది ఎత్తి చూపారు.
మరిన్ని వీడియోల కోసం :
