క్షిపణులను బూడిద చేసే S-400.. రష్యా నుంచి భారత్‌కు రానున్న 4వ యూనిట్

Updated on: May 24, 2026 | 4:15 PM

భారత్–రష్యా మధ్య 2018లో 5.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం రష్యా మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్‌కు చేరవేయాలి. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నాయి. నాలుగో యూనిట్‌ మే మాసం ఆఖరు వారంలో భారత్‌కు రానుంది. ఈ యూనిట్‌ను పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించనున్నారు.

ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది. అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధిలోని విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్, మానవరహిత వైమానిక వాహనాలు వంటి అన్ని రకాల వైమానిక లక్ష్యాలను ఛేదించగలదు. రష్యా తయారు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ ఎస్-400ను నాటో.. SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తుంది. 2018లో భారత దళాలకు అందుబాటులో వచ్చిన ఈ మిస్సైల్.. యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ.. రష్యా, భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ మిసైల్ సిస్టమ్ లో అధునాతన రాడార్‌లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలుంటాయి. వీటిని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. ఇవి 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తాయి. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు. ఈ క్షిపణులు గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో, 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు.. బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను చేధించగలవు.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

Follow Us