రష్యా నుంచి ముడిచమురు దిగుమతులు తగ్గించాలన్న ఆలోచనలో కేంద్రం

Updated on: Oct 24, 2025 | 9:07 PM

భారత ప్రభుత్వం రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా ఆంక్షలు, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని అంచనా. కేంద్రం తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

భారత్ రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చర్య భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రష్యాకు చెందిన రెండు ప్రధాన చమురు కంపెనీలైన రోస్నెఫ్ట్, లూకాయిల్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దేశీయ రిఫైనరీలు స్పాట్ మార్కెట్‌లో రష్యా చమురును కొనుగోలు చేస్తుండగా, రిలయన్స్ ఇండస్ట్రీకి రోస్నెఫ్ట్‌తో దీర్ఘకాల కాంట్రాక్ట్ ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సీటింగ్ బస్సు కి రిజిస్ట్రేషన్.. స్లీపర్ గా మార్చి సర్వీస్..!

ఏసీ స్లీపర్ బస్సుల్లోనే ఎక్కువగా ప్రమాదాలు

సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్

టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??

ఉత్త పోస్టర్‌ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్