హైదరాబాద్ టు లండన్ డైరెక్ట్‌గా వెళ్లిపోవచ్చు..! ఎయిరిండియా ప్రకటన..(వీడియో): Hyderabad to London Video.

|

Sep 15, 2021 | 11:33 AM

విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేవలం 9 గంటల్లో మీరు హైదరాబాద్‌నుంచి లండన్‌కి వెళ్లిపోవచ్చు. హైదరాబాద్‌ నుండి డైరెక్ట్‌ లండన్‌కు విమాన సర్వీసులు ప్రారంభించింది ఎయిర్‌ ఇండియా. వారంలో రెండు రోజులు...

విమాన ప్రయాణికులకు ఎయిర్‌ ఇండియా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కేవలం 9 గంటల్లో మీరు హైదరాబాద్‌నుంచి లండన్‌కి వెళ్లిపోవచ్చు. హైదరాబాద్‌ నుండి డైరెక్ట్‌ లండన్‌కు విమాన సర్వీసులు ప్రారంభించింది ఎయిర్‌ ఇండియా. వారంలో రెండు రోజులు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. సోమ, శుక్రవారాల్లో ఈ సర్వీసులను ప్రయాణికులు వినియోగించుకోవచ్చు. ఈ సందర్భంగా తొలి విమానం సెప్టెంబర్‌ 10న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌నుండి లండన్‌కు వెళ్లింది.

లండన్-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఎయిర్ ఇండియా తీపి కబురు చెప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. వారంలో రెండు రోజులు.. శుక్ర, సోమవారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి యూకేలోని హీత్రో విమానాశ్రయానికి శుక్ర, సోమవారాల్లో ఈ విమాన సేవలు ఉంటాయి. ఇక తొలి ఎయిరిండియా ఏఐ-147 విమానం సెప్టెంబర్‌ 10 ఉదయం 5.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్లింది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత కేవలం తొమ్మిది గంటల్లో లండన్‌లో ఉండొచ్చు. ఇండియా కాలమానం ప్రకారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరితే బ్రిటన్‌ కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు లండన్‌ చేరుకోవచ్చు. అలాగే సోమవారం రోజు తెల్లవారుజామున 1.30 గంటలకు శంషాబాద్ నుంచి బయల్దేరే ఎయిర్ ఇండియా విమానం హీత్రో విమానాశ్రయానికి అక్కడి కాలమానం ప్రకారం ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుంది. అదే రోజు రిటర్న్ విమానం ఏఐ-148 లండన్ నుంచి ఉదయం 9.45 గంటలకు బయల్దేరి, హైదరాబాద్‌కు రాత్రి 11.35 గంటలకు చేరుకుంటుంది.

మరిన్ని చదవండి ఇక్కడ : డ్రగ్స్ డైరీలో నేడు ముమైత్ పేజీ.. ఈడీ ముందుకు నటి ముమైత్ ఖాన్..(లైవ్ వీడియో): Mumaith Khan in Tollywood Drugs Case Video.

 అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నెత్తుటి గాయం!.. ఆల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి(వీడియో): America Attacks

 News Watch: మృగాడిని పట్టిస్తే 10 లక్షలు.| జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్..? మరిన్ని వార్తా కధనాలు వీక్షించండి(వీడియో).

 అమ్మానాన్నలకు నీరజ్ సూపర్ సర్‌ప్రైజ్..! టోక్యో ఒలంపిక్స్ తరువాత కూడా..(వీడియో): Neeraj Chopra

Follow us on