Pygmy Couple: ఆమె 5 , అతను 3.. గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కిన లవ్ స్టోరీ.! వీళ్ల ప్రేమ కూడా మొదలు కూడా ఒక రికార్డ్ నే..

Updated on: Oct 10, 2022 | 8:20 PM

టీవీ హోస్ట్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల జేమ్స్, స్కూల్ టీచరైన 27 ఏళ్ల క్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో ఓ పబ్‌లో చిగురించిన వీరి ప్రేమ ఆపై పెళ్లికి దారి తీసింది. ఐతే పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ డైస్‌ప్లాసియా


గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2023 ఎడిషన్‌ తాజాగా విడుదలైంది. ఇందులో బ్రిటన్‌కు చెందిన జేమ్స్, క్లో లస్టెడ్ పేర్లు కూడా ఉన్నాయి. భార్యాభర్తల పొడవులో అత్యంత ఎక్కువ వ్యత్యాసం ఉన్న దంపతులుగా రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. వీరిరువురి ఎత్తులో ఒక అడుగు 9 అంగుళాల వ్యత్యాసం ఉంది. భర్త 3 అడుగుల 7 అంగుళాలుండగా, భార్య 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నప్పటికి వీరి దాంపత్య జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది. టీవీ హోస్ట్‌గా పనిచేస్తున్న 34 ఏళ్ల జేమ్స్, స్కూల్ టీచరైన 27 ఏళ్ల క్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2012లో ఓ పబ్‌లో చిగురించిన వీరి ప్రేమ ఆపై పెళ్లికి దారి తీసింది. ఐతే పుట్టుకతోనే డిస్ట్రోఫిక్ డైస్‌ప్లాసియా అనే అరుదైన వ్యాధితో జేమ్స్ జన్మించడంతో అతని ఎత్తు కొన్నాళ్లకి ఆగిపోయి, మరుగుజ్జుగా మారిపోయాడు. అంతేకాదు ఈ దంపతులకు ఒలివియా అనే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. సోషల్ మీడియా ఖాతాలో ఈ జంట ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Grandfather Marriage: తాత నువ్వు కేక..! తాతయ్య పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అందుకే ఇప్పుడు ఐదో పెళ్లి..

Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్‌ బిల్ట్‌ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..