15 మంది భార్యలతో విదేశీ ట్రిప్… పేదరికంలో దేశం… రాజు జల్సా
ఆఫ్రికాలోని పేద దేశం స్వాజీలాండ్. ఇప్పటికీ రాజుల పరిపాలనలోనే ఉంది. ప్రస్తుతం మూడో మస్వాతి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అయితే రాజు మస్వాతి.. దేశాన్ని అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్లాలా అని కాకుండా జల్సాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మస్వాతికి సంబంధించిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొన్ని నెలల క్రితం మస్వాతి తన ఫ్యామిలీతో అబుదాబీ ట్రిప్‌కు వెళ్లారు. తన వెంట 15 మంది భార్యలను.. 30 మంది పిల్లల్ని కూడా తీసుకెళ్లారు. అబుదాబి విమానాశ్రయంలో తన ప్రైవేట్ జెట్ నుంచి సంప్రదాయ వస్త్రధారణలో దిగుతున్న రాజు వీడియో వైరల్ అవుతోంది. తమకు సేవలు చేయడానికి ఏకంగా 100 మంది పనివాళ్లను వెంట తీసుకెళ్లారు. రాజ కుటుంబం కావడటంతో దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక, మస్వాతి పరివారం కోసం ఎయిర్ పోర్టులోని పలు టెర్మినళ్లను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మస్వాతిపై మండిపడుతున్నారు. ‘నీ జల్సాల కోసం ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నావు. అది మంచి పద్దతి కాదు’.. ‘మస్వాతి తండ్రి రెండవ సోభుజాకు 125 మంది భార్యలు ఉండేవారు. రాజులంటేనే విలాస పురుషులు. వారిని ఏమీ అనలేం’..‘ఒక్క భార్యతోటే అల్లాడిపోతున్నాం. నువ్వు 15 మందిని ఎలా చేసుకున్నావయ్యా?’అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ
కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం
వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్ కానున్నాయా !! మళ్లీ ఏమైంది
బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే
