America visa: అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.

|

Oct 07, 2024 | 10:52 AM

అమెరికా వెళ్లాలని కోరుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో అవకాశం కల్పించింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. పర్యాటకులు, నైపుణ్యం కలిగిన కార్మికులతోపాటు విద్యార్థులకు ఇవి దోహదం చేస్తాయని తెలిపింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.

తాజాగా విడుదల చేసిన స్లాట్‌ల వల్ల వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి ఉపయోగపడతాయని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అంతేకాకుండా అమెరికా-భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకమైన ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని అభిప్రాయపడింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకుపైగా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అపాయింట్‌మెంట్లను చేపట్టినట్లు యూఎస్‌ ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం కుటుంబీకులు, బిజినెస్‌, పర్యాటకులపై దృష్టి సారించినట్లు తెలిపింది. మరోవైపు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. విద్యార్థి వీసాలు భారీగా జారీ చేయడం వరుసగా ఇది నాలుగోసారి. అయితే, ఇప్పటివరకు ఎన్ని జారీ చేసిందనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు అమెరికా వీసాలు ఇచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.