Flight Door Open: దేవుడు చెప్పాడని.. 37వేల అడుగుల ఎత్తులో విమానం డోర్‌ తీయబోయి..

|

Dec 07, 2022 | 9:15 AM

ల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ .. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది.


ల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా ఓ మహిళ .. దేవుడు చెప్పాడంటూ విమానం డోర్ తీసేందుకు ప్రయత్నించింది. అడ్డుకున్న తోటి ప్రయాణికుడిని గాయపర్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుత్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమాన సిబ్బంది, ప్రయాణికులను భయాందోళనకు గురిచేసిన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. టెక్సాస్‌కు చెందిన 34 ఏళ్ల ఎలోమ్‌ అగ్బెనినో ఇటీవల ఒహైయోలోని కొలంబస్‌ వెళ్లేందుకు టెక్సాస్‌ నుంచి సౌత్‌వెస్ట్‌ విమానంలో బయల్దేరింది. అయితే విమానం గాల్లో ప్రయాణిస్తుండగా.. ఎలోమ్‌ తన సీటు నుంచి లేచి వెళ్లి ఎగ్జిట్ డోర్‌ను తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమెను గమనించిన విమాన సిబ్బంది ఒకరు సీట్లో కూర్చోవాలని సూచించారు. అప్పుడు ఆమె తాను కిటికీ నుంచి బయటకు చూస్తానని చెప్పింది. అందుకు సిబ్బంది అంగీకరించలేదు.వెంటనే ఆమె వారిని నెట్టుకుంటూ వెళ్లి.. ఎగ్జిట్‌ డోర్‌ హ్యాండిల్‌ పట్టుకుని తెరిచేందుకు ప్రయత్నించింది. ‘‘దేవుడు నన్ను ఒహైయో రమ్మన్నాడు. విమానం డోర్‌ తీయమని దేవుడే చెప్పాడు’’ అంటూ గట్టి గట్టిగా అరవడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో విమానం గాల్లో 37వేల అడుగుల ఎత్తులో ఉంది. ఎలోమ్‌ను అడ్డుకునేందుకు తోటి ప్రయాణికుడొకరు ప్రయత్నించగా.. అతడిని ఆమె గట్టిగా కొరికి గాయపర్చింది.ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని అర్కన్సాస్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం సురక్షితంగా దిగిన తర్వాత ఎయిర్‌పోర్టు పోలీసులు ఎలోమ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపర్చారు. అయితే తాను భర్తకు చెప్పకుండానే ఒహైయోకు బయల్దేరినట్లు ఎలోమ్‌ పోలీసులు విచారణలో చెప్పిందట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

Crime Video: రెండేళ్ల బిడ్డకు తిండి పెట్టలేక చంపేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..! దర్యాప్తు లో మరిన్ని నిజాలు..

Mobile Tower: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సెల్ టవర్‌నే లేపేసారుగా.! పార్ట్‌లుగా విడదీసి ట్రక్కులో..

Published on: Dec 07, 2022 09:15 AM