గ్రహణం దెబ్బకు నలుగురు ప్రధానులు రాజీనామా..రానున్న సూర్యగ్రహం ప్రభావం ఎవరిపైనో?
ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ఎక్స్ లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘చంద్రగ్రహణం ప్రభావంతో గత రెండు రోజుల్లోనే జపాన్, ఫ్రాన్స్, నేపాల్, థాయ్‌లాండ్ ప్రధానులను జనం ఇంటికి సాగనంపారు.. అందరి చూపు త్వరలోనే ఏర్పడబోయే సూర్యగ్రహణం మీదే ఉంది.. తదుపరి రాజీనామా ఓ పెద్ద కాషాయ నేతదే కావచ్చు’ అంటూ ట్వీట్ చేశారు.
ఆయన చేసిన ట్వీట్ పరోక్షంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసినట్టు ఉంది. ఈ ట్విట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ‘‘ఆ వ్యక్తి మోదీ కావచ్చు’’ అని రిప్లయ్ ఇచ్చాడు. ప్రధాని మోదీకి వచ్చే 17తో 75 ఏళ్లు పూర్తవుతుండటంతో బీజేపీ వయసు నిబంధనల ప్రకారం ఆయన పదవి నుంచి తప్పుకుంటారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఆందోళనగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చివరకు ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ప్రధాని ఓలీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫ్రాన్స్‌లోనూ ‘బ్లాక్ ఎవ్విరిథింగ్’ ఉద్యమం పెరుగుతోంది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని బేరో సోమవారం పదవి నుంచి తప్పుకున్నారు. ఇక, థాయ్‌లాండ్, జపాన్ ప్రధానులు కూడా రాజీనామా చేశారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు దేశాల ప్రధానులు రాజీనామా చేయడంతో ఇదంతా ఆదివారం నాడు సంభవించిన చంద్రగ్రహణం ప్రభావం అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
తురకపాలెం బాధితుల్లో మెలియాయిడోసిస్ లక్షణాలు గుర్తింపు వీడియో
నర్సరీలో వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూసిన కూలీలకు షాక్ వీడియో
