ఆమె అప్పుడు హైదరాబాదీ.. ఇప్పుడు అమెరికాలో వర్జీనియా గవర్నర్
అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన, అందులోనూ హైదరాబాద్ మూలాలున్న మరో మహిళ సత్తా చాటారు. డెమొక్రాట్ పార్టీకి చెందిన గజాలా హష్మి.. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. వర్జీనియా స్టేట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించారు. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా గజాలా ప్రచారం చేశారు.
వర్జీనియాకు తొలి మహిళా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. రిచ్‌మండ్ స్టేట్ సెనెటర్‌గా ఉన్న గజాలా హష్మీ.. రిచ్‌మండ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేశారు. వర్జీనియా రేసులో గెలిచిన తర్వాత అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన భారత సంతతికి చెందిన తొలి ముస్లిం మహిళగా గజాలా హష్మీ చరిత్ర సృష్టించారు. తుపాకి నియంత్రణ, విద్యపై దృష్టి పెట్టాలని ఆమె యోచిస్తున్నారు. డెమొక్రాట్ అయిన గజాలా హష్మీ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో నిలిచి గెలిచినప్పుడు ఆ పదవికి ఎన్నికైన మొదటి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తన ప్రత్యర్థి, రేడియో షో హోస్ట్ అయిన రిపబ్లికన్ జాన్ రీడ్‌పై సునాయాసంగా విజయం సాధించారు. వర్జీనియా నుండి సెనేట్‌కు ఎన్నికైన మొదటి ముస్లిం మహిళ కూడా గజాలానే.. గజాలా హష్మీ వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన మొదటి ముస్లిం. గజాలా జూలై 5, 1964న హైదరాబాద్ లోని మలక్‌పేటలో జన్మించారు. ఆమెకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లి, అన్నయ్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ సంబంధాలలో పిహెచ్‌డి పూర్తి చేసి ప్రొఫెసర్ గా చేశారు. గజాలా.. జార్జియా సదరన్ యూనివర్సిటీ నుండి బి.ఎ. ఆనర్స్ డిగ్రీని, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీ నుండి అమెరికన్ సాహిత్యంలోను పి.హెచ్.డి.ని పొందారు. గజాలా హష్మీ ముప్పై సంవత్సరాల క్రితం అజార్ రఫీక్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు – యాస్మిన్, నూర్. ఆమె తాత ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికీ హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రియల్ ఎస్టేట్‌లో నయా ట్రెండ్.. పోతే రూ.వెయ్యి.. వస్తే ఇల్లు
నో ఫోటో షూట్, నో హగ్స్.. పెళ్లికొడుకు పది డిమాండ్లు ఇవే
పాన్‌కార్డ్ హోల్డర్స్‌కి కేంద్రం హెచ్చరిక
గుడికి వెళుతుండగా చైన్ స్నాచింగ్ సీసీటీవీ కెమెరాలో రికార్డ్
